Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో రేవంత్ వెంట నడిచేదెవరు?
By: Tupaki Desk | 18 Feb 2021 10:00 AM GMTకాంగ్రెస్ కు కాంగ్రెస్ యే శత్రువు. ఆ పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. దానికింద ఏ చెట్టు కూడా ఎదగదు. అందులోని నేతల తీరు కూడా అంతే.. వారు ఎదగరు.. వేరే వారిని ఎదగనీయరు. తెలంగాణ పీసీసీలో మార్పు కోసం నాలుగైదేళ్లుగా తంతు జరుగుతున్నా ఇప్పటికీ పీసీసీ పీఠం తేలడం లేదు. ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి ఇచ్చినా పార్టీని చీల్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఆ భయానికి అంతులేని జాప్యం చేస్తూ ఆ పార్టీ పుట్టి ముంచుతోంది.
పీసీసీ పీఠం ఖరారు కాకపోవడం.. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు లేక కాంగ్రెస్ శ్రేణులన్నీ చెదిరిపోతుననాయి. రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.
ఈ క్రమంలోనే పీసీసీ రేసులో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి పీసీసీ పీఠం కోసం ‘రాజీవ్ రైతు భరోసా యాత్రను’ చేపట్టారు. చేస్తుంది రైతుల కోసమైనా.. టార్గెట్ మాత్రం పీసీసీ పీఠమే అంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డి పీసీసీ కాకుండా ఇటు కోమటిరెడ్డి వర్గం అడ్డుకుంటోంది. దీంతో వర్గాలుగా కాంగ్రెస్ విడిపోయింది. అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందనేది తేలాల్సిన ప్రధానాంశం.
రేవంత్ రెడ్డి రైతు భరోసా యాత్రపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పాదయాత్రకు మద్దతు, రేవంత్ కు పాపులారిటీ వస్తుండడంతో దానికి ప్రచారం రాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు వేర్వేరుగా పాదయాత్రలు చేపట్టారు.
రేవంత్ నిర్వహించిన రావిరాల సభతో ఎవరు రేవంత్ వర్గం.. ఎవరు వైరి వర్గమో తేలిపోయింది. ఈ సభకు దూరంగా ఉన్న ఉత్తమ్, వీహెచ్, జానారెడ్డి, భట్టి, దామోదర రాజనర్సింహా, పొన్నాల, మధుయాష్కీ, ఎంపీ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి , కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టు తేలిపోయింది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గంగారామ్, ప్రతాపరెడ్డి, ఇందిరా శోభన్, అనిల్‌కుమార్ యాదవ్, దాసోజు శ్రావణ్ తోపాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్ సభకు హాజరయ్యారు. వీరంతా సీనియర్లపై సభా వేదికగా మండిపడ్డారు. దీంతో రేవంత్ రెడ్డికి వీరంతా మద్దతు ఇస్తున్నట్టు తేలిపోయింది.