Begin typing your search above and press return to search.
వ్యూహంలో భాగంగానే ఈటెల రాజీనామా చేయలేదా?
By: Tupaki Desk | 1 May 2021 3:30 AM GMTఊహించని విధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ తెలంగాణ సీఎం సొంత చానల్ అయిన ‘టీ న్యూస్’ లో ప్రసారం చేసిన ప్రత్యేక కథనం పెను దుమారంగా మారటమే కాదు.. జాతీయ ఛానళ్లు సైతం ఈ పరిణామాన్ని భారీ ప్రాధాన్యత ఇస్తూ ప్రసారం చేశారు. తనను కేసీఆర్ టార్గెట్ చేశారన్న విషయంపై ఈటెలకు అవగాహన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు జరగదన్న భావనలో ఉన్నట్లు చెబుతారు. తెర వెనుక ఏం జరిగిందో కానీ.. కరోనాతో ఇబ్బందికర పరిస్థితుల్ని ప్రభుత్వం ఎదుర్కొంటున్న వేళ.. అనూహ్యంగా సీఎం కేసీఆర్ అండ్ కో ఒక అడుగు ముందుకు వేసి.. ఈటెల బట్టలు విప్పే కార్యక్రమాన్ని తమ చానల్ ద్వారా షురూ చేశారు. తమ సొంత పత్రికలోనూ భారీ కథనం తప్పలేదు.
టీవీలో తనపై ప్రసారమవుతున్న కథనంపై ఈటెల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఒక సందర్భంలో తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. తొందరపడకూడదన్న ఆలోచనలో ఆయన రాజీనామా ఆలోచనను విరమించుకున్నట్లుగా చెబుతున్నారు. అధినేత కేసీఆర్ ను దశాబ్దాలుగా చూస్తున్న ఈటెలకు.. ఎప్పుడు ఎలాంటి స్టెప్పు తీసుకుంటారన్న విషయం మీద అవగాహన ఉండటంతో.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తనను రాజీనామా చేయించే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో.. వారి ప్లానింగ్ లో తాను భాగస్వామ్యం కాకుండా.. అందుకు భిన్నంగా గమ్మున ఉండాలన్న ప్లానింగ్ లో ఈటెల ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. తనను పదవి నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి నుంచి స్వయంగా ఆదేశం రావటమో.. ముఖ్యమంత్రే తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవటం లాంటివి చేసే వరకు వేచి ఉండాలన్న ఆలోచనలో ఈటెల ఉన్నట్లు చెబుతున్నారు.
ఏమైనా.. కేసీఆర్ ప్లానింగ్ కు తగినట్లుగా తాను రియాక్టు కాకూడదని ఈటెల వర్గం బలంగా ఉంది. ఈటెల మీద వెల్లువెత్తిన ఆరోపణలపై తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆశ్చర్యాన్ని.. ఈటెల లాంటి నేత మీద కేసీఆర్ కత్తి దూయటం ఏమిటన్న మాటే వినిపించింది తప్పించి.. ఈటెలపై నెగిటివ్ ప్రచారం ఎక్కడా షురూ కాలేదు. ఆ మాటకు వస్తే.. తాజా పరిణామం కేసీఆర్ కే డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇదే.. ఈటెల వర్గానికి కావాల్సిందన్న మాట వినిపిస్తోంది. ఈటెల రాజీనామాతో భారీ మైలేజీ పొందాలన్న వ్యూహంలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఆయన అనుకున్నట్లే జరుగుతుందా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.