Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ కి లొంగని ఆ వేరియంట్ .. డబ్య్లుహెచ్ఓ హెచ్చరికలు
By: Tupaki Desk | 3 Sep 2021 7:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి జోరు ఓ వైపు కొనసాగుతుండగానే, మరోవైపు రోజుకో కొత్త రకమైన కరోనా వేరియంట్ వెలుగులోకి వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ జోరు తుగ్గుతుందని చెప్తున్నా కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మూడో ముప్పు రాబోతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా మరో కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్ ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.
ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్‌కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్ తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్ లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్ లో వెల్లడించింది.
ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వేరియంట్ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎంయూ వేరియంట్ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్ లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్ ను డబ్ల్యూహెచ్ ఓ ఆగస్టు 30న వాచ్ లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్ తరహాలోనే ఎంయూ వేరియంట్ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇప్పటికే డెల్టా వేరియంట్ వంటి కొత్త వేరియంట్లతో భారత్, అమెరికా, ఇతర దేశాలు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. అమెరికాలో డెల్టా వేరియంట్ కారణంగా ప్రస్తుతం భారీ ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత కూడా ఏర్పడటం గమనార్హం. వెంటిలేటర్ చికిత్స కూడా అందరికీ అందని పరిస్థితులు నెలకొంటున్నాయి. డెల్టా వేరియంట్ 170 దేశాల్లో ప్రభావితం చూపగా, ఆల్ఫా వేరియంట్ 193 దేశాల్లో విస్తరించింది. ఇది ఇలావుండగా, కొద్ది రోజుల క్రితమే వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న సీ.1.2గా పిలిచే మరో వేరియంట్ కూడా బయటపడింది. ఇది కూడా కరోనా వ్యాక్సిన్లకు లొంగే రకం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.