Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్.. తేలికగా తీసుకోవద్దు..డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిక

By:  Tupaki Desk   |   1 Dec 2021 12:30 PM GMT
ఒమిక్రాన్.. తేలికగా తీసుకోవద్దు..డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిక
X
కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇక మహమ్మారి పీడ వదిలిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ‘ఒమిక్రాన్’ పేరు భయపెడుతోంది. సౌతాఫ్రికాలో కనుగొన్న ఈ వేరియంట్ ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా డెల్టా కంటే ఇది అత్యంత వేగంగా సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధులు సైతం పేర్కొంటున్నారు. సౌతాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తులను పరీక్షించగా కొందరికి పాజిటివ్ వచ్చింది. అయితే వారిలో ఉన్న ఒమిక్రాన్ కాదని తేల్చారు. అయినా ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై కఠిన నిబంధనలు విధించనున్నారు.

సౌతాఫ్రికాలోని బోట్స్ వానాలో ‘ఒమిక్రాన్’ ను గుర్తించారు. ఆ తరువాత యూకెలోని ఇద్దరిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు ఆ దేశం తెలిపింది. భారత్ లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. అయితే సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ సోకిన వారికి అనారోగ్యం బారిన పడ్డారని, మరణాలు సంభవించలేదని అక్కడి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఇది సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉంటాయని, ప్రాణాంతకం కాదని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజిలిక్ కొట్టి తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఆందోళన చెందాల్సిన అవరం లేదని, అయితే రూపాంతరం చెందితే మాత్రం ప్రాణాంతకంగా మారనుందని అంటున్నారు.

కాగా జర్మనీకి చెందిన ప్రొఫెసర్ కాల్ లాత్ బాక్ మాట్లాడుతూ డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ రెండు రెట్లు అధికంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇతర వైరస్ లాగే ఇది రూపాంతరం చెందుతున్నారు. అయితే ప్రాణాలు తీసే విధంగా ఉండకపోవచ్చన్నారు. ఇది వేగంగా వ్యాప్తి చెందినా మరణాలు సంభవించే అవకాశం తక్కువే అన్నారు. అయితే తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయ అంటు వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి, ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది సోకక పోవచ్చని అంటున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఇప్పుడే మొదలైంది. దీని నుంచివ్యాక్సిన్లు రక్షిస్తాయా..? లేదా..? అనే ది ఇప్పుడే చెప్పలేం. కానీ దాని వ్యాప్తి మాత్రం వేగంగానే ఉంది. అయితే లక్షణాలు తక్కువగానే ఉన్నాయని మాత్రం కొట్టిపారేయలేం. కరోనా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. పాతవాటికంటే ఇది తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందా..? లేదా అనే విషయం కూడ చూడాలి. మరోవైపు దీనిపై వ్యాక్సిన్ల ప్రభావం ఎంత ఉంటుందనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొందరు వైద్య నిపుణులు మాత్రం రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నా ఇది ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్త డేటా మాత్రం అప్పుడే తొందరపాటు వద్దని అంటోంది. కనీసం రెండు వారాలు వెయిట్ చేస్తే దాని ప్రభావం చెప్పొచ్చని అంటున్నారు.

ఇక ఒమిగ్రాన్ సోకిన వ్యక్తులను పరీక్షిస్తే అందులో 50 శాతం మ్యూటేషన్స్, 30 శాతం స్పైక్ ప్రొటీన్ మీదనే ఉన్నాయి. దీంతో రూపం మారిన వైరస్ ను వ్యాధి నిరోధక శక్తి గుర్తించడం, దానికి నిరోధక టీకాను తయారు చేయడం కష్టమే అవుతుందని అంటున్నారు. ఇందులో మూడు మ్యూటేషన్స్ ఉన్నాయి. అవి ఏ665, ఎన్679, ఓ 681ను గుర్తించారు. ఇవి శరీర కణాల్లో తొందరగా ప్రవేశిస్తాయి. కాగా గత మ్యూటేషన్లో ఉన్న విధంగా ఇందులో మెంబ్రేన్ ప్రొటీన్ లేకపోవడంతో దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.