Begin typing your search above and press return to search.
‘హెర్డ్ ఇమ్యూనిటీ’పై డబ్ల్యూహెచ్ వో వార్నింగ్
By: Tupaki Desk | 14 Oct 2020 10:30 AM GMTప్రపంచ దేశాలను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రష్యా లో ప్రయోగాత్మకంగా వేసిన స్పుత్నిక్ వి మినహా మరే వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది జనవరి నాటికి అమెరికాసహా మరి కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా ప్రమాదం అధికంగా ఉన్న వర్గాలను రక్షిస్తే సరిపోతుందని గతవారం కొంతమంది శాస్త్రవేత్తలు ఓ ప్రకటన విడుదల చేశారు. యువకులు, మధ్యవయస్కులను తమపనులు తాము చేసుకొనేలా స్వేచ్ఛగా వదిలేయాలని పరోక్షంగా హెర్డ్ ఇమ్యూనిటీ గురించి వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సూచనను ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధెనమ్ గెబ్రియేసస్ తీవ్రం గా వ్యతిరేకించారు. సామూహిక రోగ నిరోధకత ను (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేందుకు కరోనా వైరస్ ను ఉద్దేశ పూర్వకంగా వ్యాపింపజేయటం అనైతికమని అన్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే విధానం వైరస్‌ను నిరోధించేదిగా ఉండాలేకాని వ్యాపింప జేసేదిగా ఉండకూడదని అన్నారు. ఏదైనా వైరస్‌ను నిరోధించేందుకు వేసే టీకా కార్యక్రమం సంతృప్త స్థాయికి చేరిన తర్వాత కొద్ది శాతం ప్రజలు మిగిలిపోతారని అన్నారు. ఆ మిగిలిపోయిన కొద్దిశాతం ప్రజల్లో ఆ వైరస్‌ను ఎదుర్కొనేలా రోగనిరోధకత పెంచేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ విధానాన్ని వాడాలని చెప్పారు. గతంలో తట్టు వ్యాధిని అరికట్టేందుకు 95శాతం జనాభాకు టీకాలు వేశారని, పోలియోకు కూడా 80శాతం వ్యాక్సినేషన్ జరిగిందని అన్నారు. అలా చేసిన తర్వాత మిగిలిన కొద్ది మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి తట్టు, పోలియో మహమ్మారులను .తరిమికొట్టగలిగమన్నారు. చరిత్రలో ఏనాడూ హెర్డ్ ఇమ్యూనిటీ కోసం వైరస్ ను వ్యాపింపజేసిన దాఖలాలు లేవని టెడ్రోస్ పేర్కొన్నారు.
అత్యధిక దేశాల్లో కరోనా ఇప్పటికీ 10శాతం కంటే తక్కువ జనాభాకే సోకినట్టు భావిస్తున్నామని, మిగతా 90శాతం జనాభాలో అత్యధిక శాతం మంది వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారేనని అన్నారు. యువకులు, మధ్య వయస్కులు వ్యాక్సిన్ లేకున్నా కరోనా వైరస్ ను తట్టుకోగలరని వ్యాప్తిని అలాగే వదిలేస్తే ప్రజలు ఇతర వ్యాధుల బారినకూడా పడి మరణిస్తారని, అప్పుడు వృద్ధులతోపాటు అన్నివర్గాల ప్రజలూ చనిపోతారని హెచ్చరించారు. ఈ రకంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం ప్రమాదకరమని, శాస్త్రీయం కూడా కాదని తేల్చి చెప్పారు.