Begin typing your search above and press return to search.
కరోనా బాబు లాంటి జబ్బులు రాబోతున్నాయి .. తస్మాత్ జాగ్రత్త : డబ్ల్యూహెచ్ఓ
By: Tupaki Desk | 29 Dec 2020 9:00 AM GMTకరోనా మహమ్మారి ... గత ఏడాదిగా ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా తగ్గడంలేదు. రోజురోజుకి కొత్త రూపాల్లోకి మారిపోతూ మరింత డేంజర్ గా మారుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని, తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు.
టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు చేసి ఆ తరువాత మరి ఇంకేమీ పట్టించుకోని పరిస్థితులను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కరోనా మహమ్మారి నుండి పాఠాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. చాలా కాలం నుండి, ప్రపంచం భయాందోళనలు మరియు నిర్లక్ష్యం యొక్క చక్రంలో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు డబ్బును విసిరివేస్తాము, అది ముగిసినప్పుడు, మేము దాని గురించి మరచిపోతాము , ఆ తర్వాత వచ్చే వాటిని నిరోధించడం కోసం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోము అనే విధానాన్ని తప్పుపట్టిన ఆయన, అది చాలా ప్రమాదకరమైన స్వల్ప దృష్టిగల ఆలోచన అని అన్నారు.
కరోనా మహమ్మారి చివరి మహమ్మారి కాదని చరిత్ర చెబుతుంది, అంతేకాదు అంటువ్యాధులు ప్రబలుతుండటం జీవిత వాస్తవం అని టెడ్రోస్ అన్నారు. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైకేల్ ర్యాన్ చెప్పారు. భవిష్యత్తు మహమ్మారు లను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం అందుకోవడంలో ఇంకా చాలా దూరంలో ఉన్నామని, కరోనా రోజు రోజుకి రూపాంతరం చెందుతుందని , రెండు మూడు దశల్లో ప్రవేశిస్తుందని వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మనం ఇంకా పూర్తిగా సన్నద్ధం గా లేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏఎఫ్పీ సంకలనం చేసిన అధికారిక వర్గాల లెక్క ప్రకారం కరోనావైరస్ కనీసం 1.75 మిలియన్ల మంది ప్రాణాలు తీసింది గత డిసెంబరులో చైనాలో వ్యాప్తి చెందినప్పటి నుండి దాదాపు 80 మిలియన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను నివారించడానికి, గుర్తించడానికి మరియు తగ్గించడానికి అన్ని దేశాలు సంసిద్ధత సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టాలని టెడ్రోస్ చెప్పారు.