Begin typing your search above and press return to search.
ఘోర అవమానం.. టీమిండియా కు జెర్సీ స్పాన్సర్ చేసే వారే లేరా ?
By: Tupaki Desk | 2 Jun 2023 11:03 AM GMTప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ కు పెద్దన్నలా వ్యవహరించే బీసీసీఐ తాజాగా ఎదురైన అవమానకర పరిస్థితులు చూస్తే.. ఇదంతా బోర్డుకు సరైన ముందుచూపు లేకపోవటమే అన్న మాట వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ టీమిండియా జెర్సీ స్పాన్సర్ ను దొరకబట్టలేకపోవటం అవమానకరంగా అభివర్ణిస్తున్నారు.
ప్రపంచ క్రికెట్ కు పెద్దన్నగా అభివర్ణించే బీసీసీఐ.. సకాలంలో జెర్సీ స్పాన్సర్ ను డిసైడ్ చేయటంలో జరిగిన ఆలస్యం.. చివర కు ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు సాదా జెర్సీల ను ధరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా బైజూస్ వ్యవహరిస్తోంది. అయితే.. ఈ కంపెనీ స్థానే ఇటీవల ఆడిడాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది బీసీసీఐ.
అయితే.. కాంటాక్టు నుంచి బైజూస్ అర్థాంతరంగా తప్పుకోవటం.. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాడటం.. డీల్ కుదుర్చుకోవటంలో జరిగిన ఆలస్యం.. ఈ కారణంగా ఆటగాళ్లు ఎలాంటి బ్రాండ్ లేని.. సాదాసీదా జెర్సీని ధరించి ఆడనున్నట్లుగా చెబుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు ధరించే జెర్సీల మీద బీసీసీఐ.. ఆడిదాస్ లోగోలు ఉన్నప్పటికీ.. బైజూస్ అంటూ పెద్ద పేరు ఏమీ లేని జెర్సీతో ఆటగాళ్లు ఆడనున్నారు.
ఏమైనా ఇలాంటి పరిస్థితి బీసీసీఐ కు ఘోర అవమానంగా అభవర్ణిస్తున్నారు. ఇక.. ఆట విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా లోని ఓవల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 7 నుంచి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజయం కోసం రెండు జట్లు ధీమా ను వ్యక్తం చేస్తున్నాయి. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.