Begin typing your search above and press return to search.
భారత్ లో థర్డ్ వేవ్ పై డబ్ల్యూ.హెచ్.వో సంచలన ప్రకటన
By: Tupaki Desk | 25 Aug 2021 7:30 AM GMTకరోనా థర్డ్ వేవ్ గురించి ఇప్పుడు అందరిలో భయం పట్టుకొంది. గత రెండు వేవ్ ల అనుభవాల దృష్ట్యా థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలి అని ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే గత మూడు నెలలు కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు థర్డ్ వేవ్ ఉండదని... కొందరు భారీ స్థాయిలో కేసులు పెరుగుతాయని అంటున్నారు. దీంతో సామాన్య ప్రజల్లో అయోమయం నెలకొంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. థర్డ్ వేవ్ గురించి ఆమె చెప్పిన మాటలు చూస్తే థర్డ్ వేవ్ ఇక లేనట్లేనా..? అని చర్చించుకుంటున్నారు.
కరోనా రెండు వేవ్ లతో భారత్ ఉక్కిరిబిక్కిరయింది. లక్షల కొద్దీ ప్రాణాలు పోయి.. కోట్ల మంది వైరస్ బారిన బడ్డారు. ముందుగా కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకడుగు వేసినా.. ఆ తరువాత టీకా కోసం ఎగబడ్డారు. మరి కొందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా వైద్య నిపుణులు రోజుకో న్యూస్ చెప్పడంతో అసలు థర్డ్ వేవ్ ఉంటుందా..? లేదా..? అనే అయోమయం నెలకొంది. అయితే స్వామినాథన్ చెప్పిన విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.
‘మూడో వేవ్ వస్తుందని ఎవరూ చెప్పలేదు. అయితే భారత్ ఇప్పుడు ఎండెమిక్ స్టేజ్ కు చేరి ఉండవచ్చు’ అని అన్నారు. అయితే ఎండెమిక్ స్టేజ్ అంటే లో లెవల్ ట్రాన్స్మిషన్ లేదా మోడరేట్ లెవల్ ట్రాన్సిమిషన్ అని అన్నారు. ఇక ప్రత్యేకించి గతంలో లాగా భారీ స్థాయిలో కేసులు ఉండకపోవచ్చన్నారు. కేసుల సంఖ్య రోజు రోజుకు భిన్నంగా ఉంంటున్నారు. వరుసగా పెరగడం లేదు.. వరుసగా తగ్గడం లేదు. దీంతో కరోనా వైరస్ సాధారణ స్థితికి వచ్చిందనే విషయం అర్థమతున్నట్లు ఆమె వివరించారు.
సీజన్ల వ్యాధుల లాగే కరోనా కూడా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనకు తెలియకుండానే మలెరియా కేసులు ఇండియా వ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్నాయి. అలాగే కరోనా కూడా సీజన్ల వారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రత ప్రమాదకర స్థాయి నుంచి బయటపడిందని తెలుస్తోంది. అయితే సీజనల్ వ్యాధులను ఎదుర్కొన్నట్లే కరోనా ను కూడా తమ ఇమ్యూనిటీ ద్వారా ఎదుర్కొంటే వైరస్ బారిన నుంచి తప్పించుకోవచ్చని స్వామినాథన్ చెప్పిన వ్యాఖ్లయు అర్థమవుతున్నాయి.
దేశంలో థర్డ్ వేవ్ ఉంటుందని, అక్టోబర్లోనే కేసుల సంఖ్య తీవ్రత ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తమయ్యారు. కానీ వెంటనే స్వామినాథన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారాయి. దీంతో థర్డ్ వేవ్ పై అయోమయం నెలకొంది. ఇక మరో సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికే కోట్లాది మంది శరీరాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. దీంతో చాలా మందిలో యాండిబాడీస్ వచ్చాయి. మిగతా చాలా మంది వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. అయితే గ్రామస్థాయిలో మాత్రం ఇంకా పూర్తి దశలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఈ తరుణంలో థర్డ్ వేవ్ పై అయోమయం నెలకొనడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నవారిలోనే ప్రిడిక్షన్లు ఇదివరకే వచ్చాయి. అవి అంత ప్రమాదకరస్థాయివి కాదని స్వామినాథన్ తెలిపారు. దీంతో ఇప్పట్లో కొందరిలో కరోనా సోకినా స్వల్ప, మధ్యమ స్థాయిలోనే ఉంటుందని స్వామినాథన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన ఆసక్తి నెలకొంది.