Begin typing your search above and press return to search.
వుహాన్ కి డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు .. దానికోసమేనట !
By: Tupaki Desk | 17 Dec 2020 7:36 AM GMTగత ఏడాదిగా ప్రపంచాన్ని గడగడలాధించిన కరోనా వైరస్ మూలాన్ని కనిపెట్టబోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా పుట్టినిల్లు చైనాలో వుహాన్ అంటూ ప్రపంచం మొత్తం చెప్తుంది. అయితే , చైనా మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. దీనితో కరోనా మహమ్మారి విషయంలో అసలు వాస్తవాలేంటి, నిజంగా కరోనాకు మూలం వుహాన్ సిటీనేనా, కరోనా మూలం తేల్చేందుకు , కరోనా మూలాలు పరిశోధించడానికి 10 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందాన్ని వుహాన్ సిటీకి పంపుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వచ్చే నెలలో చైనా నగరమైన వుహాన్ లో పర్యటిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంతర్జాతీయ మిషన్ కు డబ్ల్యూహెచ్ వో నేతృత్వం వహించనుంది.
జనవరి మొదటి వారంలో చైనాకు అంతర్జాతీయ మిషన్ బృందం వెళ్లే అవకాశం ఉంది. అయితే గతంలో కరోనాకు మూలాన్ని అన్వేషించేందుకు స్వతంత్ర విచారణకు బీజింగ్ విముఖత చూపింది. అప్పటినుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ వుహాన్ సిటీలోకి ప్రవేశించేందుకు చాలా నెలల సమయం పట్టింది.ఈ వైరస్ జంతువులను విక్రయించే నగరంలోని వుహాన్ మార్కెట్ నుంచే వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ మూలాన్ని అన్వేషించే క్రమంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పారదర్శకంగా అన్వేషణ కొనసాగాలని WHO నేతృత్వంలోని దర్యాప్తుకు అమెరికా పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను సైతం అమెరికా విమర్శించింది.
దాంతో చైనా సైంటిస్టులకు డబ్ల్యూహెచ్ వో మొదటి దశ ప్రాథమిక పరిశోధన చేయడానికి అనుమతించింది. మధ్య చైనాలోని వుహాన్‌లో న్యుమోనియా కేసులను చైనా డిసెంబర్ 31న డబ్ల్యూహెచ్ వో కు నివేదించింది. కరోనావైరస్ ఉద్భవించిందని నమ్ముతున్న వుహాన్ మార్కెట్‌ను మూసివేసింది. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వో తమ సైంటిస్టుల బృందాన్ని వుహాన్ సిటీకి పంపుతోంది. ఆరు వారాల పాటు కొనసాగే అంతర్జాతీయ మిషన్ లో భాగంగా డబ్ల్యూహెచ్ వో కి చెందిన 12 నుంచి 15 అంతర్జాతీయ నిపుణుల బృందం వుహాన్ వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. వుహాన్ వెళ్లి చైనా పరిశోధకులు సేకరించిన మానవ జంతు నమూనాలతో సహా సాక్ష్యాలను పరిశీలించి అధ్యయనాలను రూపొందించడానికి సన్నద్ధమవుతోంది. వీరి ప్రధాన లక్ష్యం .. వైరస్ మూలాన్ని వెలుగులోకి తీసుకురావడమే.