Begin typing your search above and press return to search.
అసలు కరెంట్ కోతలు లేకుండా చేసింది ఎవరు?
By: Tupaki Desk | 8 Feb 2023 10:00 PM GMTతెలుగు రాష్ట్రాలు ఇటీవల విద్యుత్ సమస్యను తీవ్రంగా ఎదర్కొంటున్నాయి. ఇటు తెలంగాణ, అటు అంధ్రాలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే గత ఎనమిదేళ్లుగా నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసిన విషయం వాస్తవమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ చీకట్లోకి వెళ్తుందని అందరూ విమర్శించారు. కానీ ఇప్పుడు వారే మెచ్చుకుంటున్నారు. కానీ ఇటీవల కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా సరిగా లేదని రైతులు ఆందోళన బాట పట్టారు.
వీరికి బీజేపీ నాయకులు తోడై బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్ మరి ఇప్పుడు ఆటంకాలు సృష్టించడానికి కారణం ఏంటి? అసలు ఇన్నాళ్లు కరెంట్ కోతలు లేకుండా సరఫరా చేయడానికి కేసీఆర్ కు ఎలా సాధ్యమైంది? అన్న చర్చ సాగుతోంది.
2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అంతకుముందు చెప్పిన విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. వ్యవసాయంతో పాటు నివాస గృహాల్లో కరెంట్ కోతలు ఉండవనే విధంగానే సరఫరా చేయించారు. అయితే ఇది సాధ్యం కావడానికి కేంద్రం హస్తంకూడా ఉందని కొందరు బీజేపీ నాయకులు వివరిస్తున్నారు.
మోదీ పవర్ గ్రిడ్ల అనుసంధానం చేయడం ద్వారానే తెలంగాణకు 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని చెబుతున్నారు. 2014లోనే అధికారంలోకి వచ్చాక మోదీ పవర్ గ్రిడ్లను అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందని అంటున్నారు. అలాంటప్పుడు దేశ రాజధాని లో ఢిల్లీలో కరెంట్ కోతలు ఎంందుకు ఉంటున్నాయన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. దీనికి రాష్ట్రాలు చేస్తున్న తప్పులేనని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దేశం మొత్తంలో విద్యుత్ కొరత లేదని, రాష్ట్రాలు ముందుగా కొటేషన్ పెట్టకపోవడంతోనే కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఒకవేళ రాష్ట్రాలు కొటేషన్ పెట్టకపోతే రాష్ట్రాలే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు కొటేషన్ పెట్టి గడువు తేదీ చివరి నిమిషంలో వాడుకుంటారు. దీంతో విద్యుత్ వ్యయం అధికంగా పెరుగుతుంది. ఉదాహరణకు గడువు లోపల కరెంట్ రూ.2 నుంచి రూ.3 ఉంటే.. చివరి నిమిషంలో ఇది రూ. 6కు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నష్టాన్ని భరించడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ను కొనుగోలు చేసుందుకు ముందుకు రారు. ఈ నేపథ్యంలోనే కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయని అంటున్నారు.
అయితే ఇటీవల మోదీ వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేనినాదాన్ని తీసుకొచ్చారు. దేశం మొత్తం మీద ఒకే గ్రిడ్ వ్యవస్థను తీసుకొచి్చ అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా విద్యుత్ సరఫరా చేస్తానని ఇటీవల బెంగుళూరులో పర్యటించిన సందర్భంగా ప్రకటించారు. ఇదే జరిగితే ముందు ముందు కేంద్రమే రాష్ట్రాలతో సంబంధం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.