Begin typing your search above and press return to search.

బక్రీద్ ‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన డబ్లుహెచ్‌వో

By:  Tupaki Desk   |   31 July 2020 9:50 AM GMT
బక్రీద్ ‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన డబ్లుహెచ్‌వో
X
దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ముస్లింల ప‌విత్ర పండుగ బక్రీద్‌ పై ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్ర‌భుత్వాలు మార్గదర్శకాలను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇళ్ల‌లోనే ప్రార్థ‌న‌లు జ‌ర‌పుకోవాల‌ని ముస్లిం సోదరులకు విజప్తి చేసారు. కాగా తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో మార్గదర్శకాలు విడుదల చేసింది.

బక్రీద్ పండుగ సందర్భంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించింది. సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కును తప్పని సరిగా ధరించాలని సూచించింది. అలాగే జంతు వధ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. అనారోగ్యంతో ఉన్న గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని, ఇళ్ల వద్ద జంతు వధ చేయ‌కూడ‌ద‌ని, జంతువులు అస్వస్థతతో ఉంటే వాటిని ప్రత్యేకంగా ఐసోలేషన్ ‌లో ఉంచాలని డబ్ల్యూహెచ్ ఓ సూచించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మనుషులను ఇన్ఫెక్షన్‌ కు గురిచేసే కరోనా వైరస్ జంతువులను కూడా సోకే అవ‌కాశం ఉంది.

అయితే , జంతువుల నుంచి నేరుగా మనుషులకు కరోనా వ్యాప్తి చెందుతుంద‌న్న విష‌యంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే , బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు భౌతికంగా తాకి శుభాకాంక్షలు తెలుపుకోవడం మంచిది కాదు అని , చేయి ఊపడం, హృదయంపై చేయి ఆన్చడం వంటి చర్యలతోనూ బక్రీద్ విషెస్ చెప్పుకోవాలని డబ్ల్యూహెచ్ ఓ సూచించింది. అలాగే . పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఒకేచోట గుమికూడడాన్ని నివారించాలని, మసీదులు, దుకాణాలు, మార్కెట్ల లో ఎక్కువమంది ఒకేచోట ఉండకుండా చూడాలని వివరించింది.