Begin typing your search above and press return to search.

కరోనాకి సరైన మందు ఇదే .. మరణాల్ని భారీగా తగ్గింస్తుందన్న WHO !

By:  Tupaki Desk   |   5 Sep 2020 11:10 AM GMT
కరోనాకి సరైన మందు ఇదే .. మరణాల్ని భారీగా తగ్గింస్తుందన్న WHO !
X
మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది. పరుగెత్తి పాలు తాగడం కంటే... నిల్చొని నీళ్లు తాగడం మేలు అని , ఇప్పుడు అదే చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడో వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ కంటే, కార్టికోస్టెరాయిడ్స్ మందులు కరోనాకి బాగా పనిచేస్తున్నాయనీ, ముఖ్యంగా కరోనా మరణాల్ని అడ్డుకుంటుంది అని తెలిపింది. అయితే , ఈ పవర్‌ఫుల్ మందుల్ని అందరు పేషెంట్లకూ ఇవ్వరు. ప్రాణాలు పోయే దశలో ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారు. వీటిలో కొన్ని రకాలున్నాయి. అన్నింటినీ కలిపి... కార్టికోస్టెరాయిడ్స్ అంటున్నారు. ఇలాంటి వాటిలో ఒకటైన డెక్సామెథసోన్ అద్భుతంగా పనిచేస్తోందని WHO ఇదివరకు చెప్పింది.

ఇప్పుడు ఇదే గ్రూపులో భాగమైన మరో స్టెరాయిడ్ డ్రగ్ హైడ్రోకార్టిసోన్ కూడా ఇదే విధంగా కరోనా పేషెంట్ల మరణాల్ని... ప్రాణాలు కాపాడుతోందని వెల్లడించింది. కొన్ని దశాబ్దాలుగా... మనుషుల్లో వచ్చే వేడిని తగ్గించేందుకు ఈ మందుల్ని వాడుతున్నారు. వేడి అంటే... ఇందులో కూడా రకరకాల వేడి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో వచ్చే వేడి... నిమోనియా లాంటిది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వేడి, శ్వాస సమస్యలతో వచ్చే వేడి ఇలా ఉంటాయి. ఆస్తమా, ఎక్జెమా అనారోగ్య సమస్యలకు కూడా ఈ మందుల్ని వాడుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందులు ప్రపంచం మొత్తం అందుబాటులో ఉన్నాయి. ధర కూడా అందరికి అందుబాటులోనే ఉంటుంది.

డెక్సామెథసోన్ బాగా పనిచేస్తోందని, వెంటిలేటర్ సపోర్ట్‌ తో ఉన్నవారికి ఈ మందును ఇవ్వొచ్చని జూన్‌ లో WHO తెలిపింది. నిజానికి ఇదో బోరింగ్ డ్రగ్ అంటుంటారు బ్రిటన్ డాక్టర్లు. ఎందుకంటే... ఇది ఎప్పటి నుంచో ఉన్న మందు. ఇది కరోనాను అడ్డుకోవడం గొప్ప విషయమే. దీన్ని వాడుతుంటే... ప్రతి వంద మంది మృతుల్లో 35 మంది చనిపోకుండా మళ్లీ కోలుకుంటున్నారు. మరి కరోనా అంతంత మాత్రంగా ఉన్న వారికి ఈ మందులు ఇవ్వొచ్చా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. దీనిపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇకపోతే , దేశంలో గత 24 గంటల్లో 86,432 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40,23,179కి పెరిగింది.నిన్న ఒక్క రోజే 1089 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 69561కి చేరింది.