Begin typing your search above and press return to search.

మోడీకి జ‌గ‌న్ లేఖ‌...ఎలా లీక్ అయి ఉండ‌వ‌చ్చు

By:  Tupaki Desk   |   16 May 2017 2:26 PM GMT
మోడీకి జ‌గ‌న్ లేఖ‌...ఎలా లీక్ అయి ఉండ‌వ‌చ్చు
X
ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం! పూర్తి అవాస్త‌వాల‌తో త‌మ‌ పార్టీని ప‌లుచ‌న చేయ‌డానికి సాగుతున్న‌ప్ర‌యత్నాన్ని ఖండిస్తూ స‌ద‌రు ప‌త్రిక‌, టీవీ ఛాన‌ల్ త‌మ కార్య‌క‌లాపాల‌కు దూరం పెడుతున్న‌ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది. ఇదిలాఉంటే స‌ద‌రు క‌థనంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ ఆ మీడియా సంస్థ‌కు ఎలా చేరింది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

వివిధ వ‌ర్గాల నుంచి వెలువ‌డుతున్న అభిప్రాయాల‌ ప్ర‌కారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి రాసిన లేఖ‌ను వైసీపీ అధికారికంగా స‌ద‌రు మీడియా సంస్థ‌కు ఇచ్చి ఉండక‌పోవ‌చ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా అంత సాహ‌సం చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక ప్ర‌ధాన‌మంత్రి ద్వారా ఆ లేఖను ప‌్ర‌తుల‌ను ఇచ్చే అవ‌కాశం ఉండదు. అలాంట‌పుడు స‌ద‌రు లేఖ ఎలా చేరి ఉంటుంద‌నే సందేహానికి సందేహం అంద‌రిలోనూ నెల‌కొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఒక‌రు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల మేర‌కు ఈ లేఖ‌ను సంపాదించి స‌ద‌రు ప‌త్రిక‌కు చేర‌వేసి ఉంటార‌నే ప్ర‌చారం సాగుతోంది. దాని ఆధారంగానే ఆ మీడియా సంస్థ క‌థ‌నాలు ప్ర‌చురించి ఉంటుందా అనే ప్ర‌చారం సాగుతోంది.

కాగా,టీడీపీతో స‌న్నిహితంగా ఉండే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒక‌రు ఏమైనా ఇచ్చి ఉంటారా అనే అనుమానాలు సైతం వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతున్నాయి. స‌ద‌రు అధికార పార్టీ కేంద్ర‌మంత్రి త‌న వ్య‌క్తిగ‌త చొర‌వ‌తో లేఖ‌ను రాబట్టి ఈ మీడియా సంస్థ‌కు ఇచ్చి ఉంటారా అనే సందేహాలు వ్య‌క్తం చేశారు. బీజేపీలోని ఉన్న‌త వ‌ర్గాలే ఈ లేఖను కావాల‌ని లీక్ చేసి ఉంటాయా అనే అభిప్రాయాన్ని సైతం కొంద‌రు వినిపిస్తున్నారు. రాజ‌కీయాల్లో ఏదీ అనూహ్య‌మైన ప‌రిణామం కాదు క‌దా అని విశ్లేషిస్తున్నారు.