Begin typing your search above and press return to search.
రేవంత్ 'నకిలీ' డాక్యుమెంట్ల వెనుక ఓ వ్యాపారి?
By: Tupaki Desk | 29 Sep 2018 11:29 AM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు - కేసుల వ్యవహారాలు వేడి పుట్టిస్తోన్న సంగతి తెలిసిందే. మొన్న జగ్గారెడ్డి అరెస్టు వ్యవహారం తీవ్ర సంచలనం రేపగా....తాజాగా నిన్న రేవంత్ రెడ్డి - ఆయన కుటుంబ సభ్యులు - బంధువుల ఇళ్లు - ఆఫీసులపై ఐటీ - ఈడీ దాడులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. అయితే, తనపై కేసీఆర్ కక్షగట్టారని - టీఆర్ ఎస్ సర్కార్ అన్యాయాలను ఎండగట్టినందుకు తనపై ఈ రకంగా పగ తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ పై ఐటీ దాడులకు సంబంధించి ఓ పుకారు బయటకు వచ్చింది. రేవంత్ పై ఐటీ, ఈడీ దాడుల వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి హస్తమున్నట్లు వదంతులు వెలువడుతున్నాయి. రేవంత్ పై కొన్ని ఆరోపణలున్న డాక్యుమెంట్లు లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల అఫిడవిట్ - ఐటీ రిటర్నులు - విదేశాల నుంచి నిధుల అకౌంట్ నంబర్లు - రియల్ ఎస్టేట్ ద్వారా భూములు పొందిన వివరాలు ....ఈ తరహా వివరాలన్నీ ఆ డాక్యుమెంట్లలో పక్కాగా ఉన్నాయి. కానీ, అనధికారికంగా ఫిర్యాదు చేసేందుకే అన్నట్లు ప్రిపేర్ చేసిన ఆ డాక్యుమెంట్ల వెనుక కర్త ఎవర్నది తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.
ఆ డాక్యుమెంట్లు తీక్ కావడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రేవంత్ పై బురద జల్లేందుకే వాటిని విడుదల చేశారని ఆరోపిస్తున్నాయి. విదేశాల్లో రేవంత్ పేరుపై ఉన్న ఖాతాలు నకిలీవా అసలువా...అన్నది దర్యాప్తు సంస్థలు తేల్చకుండానే మీడియాకు ఆ వివరాలు ఎలా వచ్చాయని కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి మండిపడుతున్నారు. ఐటీ, ఈడీ అధికారుల దగ్గరున్న ఆ సమాచారం మీడియాకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ డాక్యుమెంట్ల లీక్ వెనుక ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వ్యాపారి అనుచరులే ఈ నకిలీ అకౌంట్ లు సృష్టించి రేవంత్ పై నిందమోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ డాక్యుమెంట్లు నకిలీవని ఐటీ అధికారులతో రేవంత్‌రెడ్డి చేసినట్టు తెలుస్తోంది. తన ఐటీ రిటర్న్స్ పేపర్లను రేవంత్... అధికారులకు చూపారని, నకిలీ పేపర్లపై తాము కూడా విచారణ చేస్తామని అధికారులు చెప్పినట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.