Begin typing your search above and press return to search.

పరీక్షా పత్రాల్లో 'గాసిప్' ప్రశ్నలు!

By:  Tupaki Desk   |   17 Oct 2016 7:30 PM GMT
పరీక్షా పత్రాల్లో గాసిప్ ప్రశ్నలు!
X
సాదారణంగా స్కూల్ పిల్లలకు నిర్వహించే పరీక్షల్లో ఏమి ప్రశ్నలు ఇస్తారు? పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలు సిలబస్ ఆధారంగా ఆయా పరీక్షల్లో అడుగుతారు.. జనరల్ నాలెడ్జ్ లో భాగంగా దేశంలో - ప్రపంచంలో జరుగుతున్న కీలక ఘట్టాల గురించి అడుగుతారు.. ఇక స్పోర్ట్స్ విషయనికొస్తే విన్నర్స్ పేర్లు - సంవత్సరాలు మొదలైనవి ముఖ్యంగా ఒలింపిక్స్ కు సంబందించినవి అడుగుతారు.. స్వాతంత్ర సమరయొధులకు సంబందించిన ప్రశ్నలు కూడా జీకే లో వేస్తారు! ఇది అంతా పాత పద్దతి అనుకున్నారో ఏమో కానీ తాజాగా సినిమాల మీదా - గాసిప్పుల మీద కూడా పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు!!

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు? అని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన పీటీ పరీక్షల్లో ఈ ప్రశ్న వేశారు మహారాష్ట్రలోని భీవండి హైస్కూల్ ఉపాధ్యాయులు. ఈ ప్రశ్నకు (ఎ) ప్రియాంక చోప్రా (బి) అనుష్క శర్మ (సి) దీపికా పదుకోన్ (డి) తెలియదు వంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అదేమిటి? ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అనుకోకండి.. అడుగుతారు మరి!! కాకపోతే ఈ ప్రశ్న చూసిన విద్యార్థులు మాత్రం షాకయ్యారు. స్థానిక మీడియాలో ఈ విషయం రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు విరాట్ గాళ్ ఫ్రెండ్ ఎవరైతే విద్యార్థులకు ఏమిటంట? అసలు పీటీ పరీక్షకూ విరాట్ గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా సంబందం ఉందా? ఏమో... ఆ పరీక్ష పత్రం తయారుచేసిన పెద్దాయనకే తెలియాలి.

ఇదే క్రమంలో గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా పేపర్ లో బాలీవుడ్ నటి దీపిక పదుకోనె కు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి, అలాగే తమిళనాడులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థులకు సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో "బాహుబలి" సినిమాకు సంబంధించిన ప్రశ్న కనిపించింది. ఉపాధ్యాయులు - విద్యాశాఖ అధికారుల తీరు చూస్తుంటే వారికి సినిమాలపైనా - హీరోయిన్స్ గాసిప్పుల పైనా ఎంత శ్రద్ధ ఉందో ఇట్టే అర్ధమవుతుంది అని పలువురు విమర్శిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/