Begin typing your search above and press return to search.

పోలీసులనే చంపిన వికాస్ దూబే రక్తచరిత్ర

By:  Tupaki Desk   |   4 July 2020 7:45 AM GMT
పోలీసులనే చంపిన వికాస్ దూబే రక్తచరిత్ర
X
వికాస్ దూబే.. కరుడుగట్టిన ఉత్తరప్రదేశ్ రౌడీషీటర్. ఇప్పుడు ఇతడి పేరు చెబితేనే ఉత్తరప్రదేశ్ లో చాలా మంది హడలిపోతున్నారు. తాజాగా 8మంది పోలీసులను అందులో ఓ డిప్యూటీ ఎస్పీని కాల్చిచంపి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు. అంతకుముందు మంత్రితోపాటు రాజకీయ నాయకులు, ప్రత్యర్థులను అతి దారుణంగా చంపి మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ గా యూపీలో వికాస్ దూబే ఫేమస్ అయ్యాడు.

కరుడుగట్టిన వికాస్ దూబే నేర చరిత్ర ఏంటి? జైల్లోనే స్కెచ్ లు వేసి బంధువులను ఎలా లేపేశాడు అని యూపీలో చర్చించుకుంటున్నారు. కరుడుగట్టిన నేరచరిత్రను ఒకసారి తవ్వి చూస్తే..

*వికాజ్ దూబే కరుడుగట్టిన క్రిమినల్..65కు పైగా కేసులు
హత్యలు, దోపిడీలు, లూటీలు, రేప్ లు, కిరాయి హత్యలతో వికాస్ దూబే 65కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. యూపీలోని పంచాయితీ ఎన్నికల్లో గెలిచి రౌడీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2001లో యూపీకి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, నాటి మంత్రి సంతోష్ శుక్లాను అతిదారుణంగా హత్య చేశాడు. అధికారంలో ఉన్న మంత్రి హత్యతో దేశవ్యాప్తంగా ఈ నేరస్థుడి పేరు చర్చనీయాంశమైంది. వికాస్ దూబే సాక్షులను బెదిరించడంతో ఎవరూ సాక్షం చెప్పకపోవడంతో మంత్రిని హత్య చేసినా న్యాయస్థానంలో నిర్ధోషిగా బయటకు వచ్చాడు.

విద్యాసంస్థలు మామూళ్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ , కాలేజ్ మేనేజర్ ను చంపేశాడు. తనను ఎదురించిన అందరినీ చంపేశాడు. గ్యాంగులను తుదముట్టించాడు. 2018లో సమీప బంధువు , అతడి ముఖ్య అనుచరులు నలుగురిని చంపేశాడు.

2000లో రాజకీయ నాయకుడు రామ్ బాబు యాదవ్ హత్య కేసులో వికాస్ జైలుకెళ్లాడు. ఆ సమయంలోనే జైల్లోనే ఉండి సమీప బందువు ఎదురు తిరిగినందుకు దినేష్ దూబేనే చంపించాడు. యూపీని గడగడలాడిస్తున్న వికాస్ దూబేను తాజాగా పట్టుకోవడానికి 8 మంది పోలీసులు రాగా వారిని అతిదారుణంగా కాల్చి చంపేశాడు.