Begin typing your search above and press return to search.
జానారెడ్డి రాయబారం వెనుక ఉన్నదెవరు?
By: Tupaki Desk | 6 Dec 2020 4:11 AM GMTఏదో గాలి వీసిన కారణంగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారే కానీ.. గ్రేటర్ హైదరాబాద్ లో గెలవమనండి చూద్దామన్న మాటలు ఎన్నికలకు ముందు చాలానే వినిపించాయి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ పాతిక లోపు సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు కూడా. అయితే.. బీజేపీ మీద అభిమానం కంటే కూడా.. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ‘పువ్వు’ గుర్తుకు ఓటేసేందుకు మహానగర ఓటర్ ఆసక్తిని చూపించాడు. ఈ కారణంతో లెక్కలు మారిపోయాయి. సీట్ల సాధనలో అధికార పార్టీకి కొత్త కష్టం ఎదురైంది. దీంతో గ్రేటర్ లో 99 డివిజన్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు 55 డివిజన్లకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ ఫలితం అధికారపార్టీకి ఏం జరుగుతుందన్న విషయంపై కొత్త సందేహాలు రాగా.. తమది వాపు కాదు బలుపు అన్న విషయాన్ని కమలనాథులకు మరింత బాగా అర్థమైంది.ఇలాంటివేళలోనే అనుకోని రీతిలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యం కావటంతో.. కొత్త లెక్కలు మొదలయ్యాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో బీజేపీ బలం అసలేమీ లేదనే చెప్పాలి. ఉనికి కూడా కష్టమే అన్న మాట సరిపోతుందేమో? ఇలాంటి చోట.. కమలనాథులు ఏం చేస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది.
కేసీఆర్ లాంటి అధినేత మీద రాక రాక వచ్చిన పట్టును వదులుకోవటానికి బీజేపీ ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అందుకే.. తెర మీదకు కొత్త ఎత్తులు వచ్చాయి. నాగార్జునసాగర్ లో పాగా వేసేందుకు.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డికి వల వేశారు. కేరళలో ఉన్న ఆయనకు టచ్ లోకి వెళ్లిన కమలనాథులు.. తెర వెనుక జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాలోనూ ఈ అంశం మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి స్పందించారు.
‘‘నాన్నగారు ఈ నెల ఏడున కేరళ నుంచి వస్తారు. వారు వచ్చాకే నిర్ణయం జరుగుతుంది’ అని చెప్పటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అయితే.. ఈ ఇష్యూలో రెండు అంశాల మీద చర్చ జరుగుతోంది. అందులో ఒకటి జానారెడ్డిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తీసుకురావటం. రెండోది.. జానా రాజకీయాల్లో రిటైర్ కావటం.. ఆయన కుమారుడు రఘువీర్ బీజేపీలోకి చేరటం. అయితే.. వీటన్నింటి వెనుక ఉన్నదెవరు? జానా కుటుంబాన్ని కమలంలోకి తీసుకురావటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నదెవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేయగా.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.
జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలోకి తెచ్చేందుకు మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న అరుణకు జానారెడ్డి ఫ్యామిలీతో యాక్సిస్ ఉండటమే కాదు.. సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె ద్వారా మాత్రమే పని అవుతుందని భావించిన కమలనాథులు.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోలేదు కానీ.. తెర వెనుక ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు.