Begin typing your search above and press return to search.
ట్రంప్ దంపతుల వెంట ఆమెవరు..? ఎక్కడామె
By: Tupaki Desk | 25 Feb 2020 11:15 AM GMTదేశ్య వాప్తంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతుల పర్యటన పైనే ఆసక్తి ఉంది. ట్రంప్ దంపతులు ఎప్పుడొచ్చారు.. ఎక్కడికెళ్లారు.. ఏం మాట్లాడారు.. తదితర వివరాలతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ట్రంప్ భారతదేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రజలు టీవీల ముందు కూర్చొని వీక్షిస్తూనే ఉన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనల్డ్ ట్రంప్, మెలానియా దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఎర్ర తివాచీపై ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ తదితరులు వస్తున్నారు. అయితే ట్రంప్ దంపతుల వెంట మాత్రం ఓ మహిళ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు.
రెడ్ కార్పెట్ పై ఆమె కూడా నడిచారు. ట్రంప్ దంపతులతో పాటు ఆమె కూడా కనిపించడం తో ఆ మహిళ ఎవరూ అని ప్రజల్లో సందేహం వ్యక్తమైంది. ఏమైనా వివరాలు లభిస్తాయమోనని నెట్ లో వెతకడం ప్రారంభించారు. అయితే ఆమె గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఆమె మన భారతీయ మహిళ. పేరు గురుదీప్ చావ్లా. అమెరికా లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మహిళ. ఆమె అనువాదకురాలు. అనువాదకురాలిగా 27 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనువాదకురాలిగా పని చేస్తున్నారు. ఒక్క నరేంద్ర మోదీ కే కాదు.. గతంలో ప్రధానులు గా పని చేసిన వీపీ సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌ల వద్ద ఆమె పని చేశారు.
1990లో గురుదీప్ చావ్లా ఇండియన్ పార్లమెంట్ లో అనువాదకురాలిగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పుడు ఆమె వయసు 21. 2015 రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భం గా బరాక్ ఒబామాకు కూడా ఆమె అనువాదకురాలిగా పని చేశారు. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లినా ఆమె ఆయన వెంటే ఉంటారు. ఆయన హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఆంగ్లంలోకి అనువదించి ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులకు వివరిస్తారు. మరో వైపు గతంలో భారత పర్యటన కు విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు కూడా గురుదీప్ సేవలు అందించారు. ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశం, మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఈవెంట్, విదేశాంగ మంత్రుల మండలి భేటీ వంటి కీలక సమావేశాల్లో ప్రధాని భాషను ఈమె అనువదించారు.
తాజాగా ట్రంప్ పర్యటనల్లోనూ ఆమె ఉన్నారు. భాషపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆమె వెంటనే స్పందించి వారికి అర్థమయ్యే రీతిలో వారి భాష లో సమాధానం ఇస్తున్నారు.