Begin typing your search above and press return to search.
పవన్ కి ముప్పు ఎవరి నుంచి....?
By: Tupaki Desk | 18 Jun 2023 4:00 PM GMTతన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. జనసేన అధినేతగా పవన్ గత నాలుగు రోజుల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన రెండు బహిరంగ సభలను నిర్వహించారు. అదే విధంగా ఆయన పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. జనసేన నాయకులతో ఆయన కాకినాడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని హాట్ కామెంట్స్ చేశారు.
తనను అంతమొందించేందుకు రెండు సుపారీ గ్యాంగులను కూడా రంగంలోకి దించారని అంటున్నారు. పక్కా సమాచారంతోనే ఇది చెబుతున్నాను అని అంటున్నారు. తనకు భద్రత చాలా ముఖ్యమని తాను బతికి ఉంటేనే పార్టీని నడపగలను కాబట్టి ప్రతీ జనసేన కార్యకర్త భద్రతా నియమాలను పాటించాలని పవన్ కోరారు.
అసలు ఇంతకీ పవన్ ప్రాణాలకు ముప్పు ఉందా ఉంటే ఎవరి నుంచి ఉంటుంది అన్నది ఇక్కడ చర్చగా ఉంది. పవన్ చెప్పిన మాటలనే తీసుకుంటే అధికారంలో ఉన్న వారు తాము పోగొట్టుకోవాలని అనుకోరని, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎందాకైనా వెళ్తారు అంటూ చెప్పుకొచ్చారు. మరి పవన్ చెప్పిన దానిని బట్టి ఆయన అధికారంలో ఉన్న వారు ఎవరైనా ఈ పని చేయించాలని అనుకుంటున్నారని భావిస్తున్నారా అన్నది చర్చగా ఉంది.
సుపారీ గ్యాంగులు ఎవరేమిటి అన్నది తరువాత బయటకు వస్తుందని పవన్ అంటున్నారు. అయితే పవన్ చేస్తున్న ఈ కామెంట్స్ కొత్తవి కావు అని అంటున్నారు. 2019 ఎన్నికల వేళ కూడా అపుడు అధికారంలో ఉన్న టీడీపీ మీద పవన్ ఇదే తరహా ఆరోపణలు చేశారు. తనకు అధికార పార్టీ నుంచి ప్రాణహాని ఉందని అన్నారు. దాని మీద నాటి అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి అలాంటిమేదీ ఉండదని స్పష్టం చేసింది.
ఇక నాడు ఏమీ జరగలేదు. మళ్లీ నాలుగేళ్ళ తరువాత పవన్ ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. ఇపుడు కూడా అధికార పార్టీ మీదనే ఆయన చేస్తున్నారు అని భావించాలి. అయితే ఏపీ హిస్టరీ ఉమ్మడిగా ఉన్నా విడిగా ఉన్నపుడు అయినా చూసుకుంటే హత్యా రాజకీయాలు జరిగిన చరిత్ర అయితే పెద్దగా లేదు గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎన్నో పార్టీలు హోరాహోరీగా పోరాటం చేసాయి. అయినా సరే అవి మాటలకే పరిమితం అయ్యాయి తప్ప చేతలకు కానే కాదు.
అంతవరకూ ఎందుకు ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ సినీ ఇండస్ట్రీ నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే తొమ్మిది నెలల పాటు జనంలో ఉన్నారు. ఆయన మీద ఏ చిన్న సంఘటన జరగలేదు. నాడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. కేంద్రంలో అదే పార్టీ ఉంది. అంతటి బలమైన ప్రభుత్వాలు ఉన్నా ప్రజాస్వామిక పద్ధతిలోనే ఎన్టీయార్ ప్రచారం చేసుకున్నారు తప్ప ఏ రకంగానూ దాడులు అయితే జరగలేదు.
ఇక చంద్రబాబు అత్యంత బలంగా ఉంటూ తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీని పాలించిన టైంలో సైతం వైఎస్సార్ పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. జనంలో కలసిపోతూ యాత్ర సాగించారు. నాడు వైఎస్సార్ కి ఏ రకమైన ఇబ్బంది కలగలేదు. అదే విధంగా చంద్రబాబు పాదయాత్ర చేసినా షర్మిల చేసినా, ఆఖరుకు జగన్ పాదయాత్ర చేసినా ఏ ఒక్క సంఘటన జరగలేదు.
పైగా వారి నోటి నుంచి తమ ప్రాణాలకు హాని అన్న మాట కూడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఇలాంటి ప్రకటనలు ఇచ్చి ఉన్నారు అది కూడా 2019లో ఒకసారి తాజాగా ఒకసారి. అయితే పవన్ కి ముప్పు ఉందా ఉంటే ఎవరి నుంచి అన్న చర్చ వస్తోంది. పవన్ ఒక సినీ సెలిబ్రిటీ. అలాగే ఒక రాజకీయ పార్టీకి అధినేత.
ఆయన తన ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పిన నేపధ్యంలో ఆయన భద్రతను మరింతగా సమీక్షించాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆయన చెబుతున్న దాని మీద విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పవన్ కనుక కోరుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సెక్యూరిటీ ఇప్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో హింసకు తావు లేదు పవన్ పదే పదే తన ప్రాణాలకు హాని అంటున్నారు. బాధ్యత కలిగిన పార్టీలే ఏపీలో ఉన్నాయి.
కానీ ఈ ప్రకటనలను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు ఎవరైనా ముప్పు తలపెట్టేందుకు ఆస్కారం ఉంది కాబట్టి పవన్ స్వయంగా తన ప్రాణాలకు భద్రత లేదు అని చెప్పిన నేపధ్యాన్ని చూసి ఏపీ ప్రభుత్వం మరింతంగా ఆయన భద్రత మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక ఎన్నికల వేళ అందునా కోట్లాదిమందిని ఆకట్టుకునే పవన్ లాంటి నాయకుడి మీద దాడులు చేసేందుకు ఎవరూ ఉపక్రమించరు.
దాని వల్ల వచ్చే ఫలితాలు పర్యవసానాలు అందరికీ తెలుసు. అందువల్ల రాజకీయంగా అయితే పవన్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అసాంఘిక శక్తుల నుంచి ఏమైనా ముప్పు ఉందేమో అన్న కోణం నుంచి ఆలోచన చేయడమే కాదు, ప్రభుత్వం తన బాధ్యతగా మరింతగా ఆయన భద్రతను చూడాల్సిన అవసరం అయితే ఉంది.