Begin typing your search above and press return to search.

కొత్త సీఎస్ ఎవరు? కేబినెట్ లో చర్చ

By:  Tupaki Desk   |   18 Dec 2020 5:04 PM GMT
కొత్త సీఎస్ ఎవరు? కేబినెట్ లో చర్చ
X
ఈనెల 31వ తేదితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగుస్తోంది. ఆమె 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈరోజు జరిగిన కేబినెట్ భేటిలో సీఎం జగన్, మంత్రులు ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. తన హయాంలో నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయాలను జగన్ కొనియాడారు.

ఈ ఏడాది జూన్ 30తోనే నీలం సాహ్ని గడువు ముగిసినా సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడి రెండు సార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు. డిసెంబర్ 31తో ఆ పదవీ కాలం ముగుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ తీసేసిన తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని సీఎం జగన్ ఏపీ సీఎస్ గా నియమించారు. కరోనా సంక్షోభ కాలంలో సాహ్ని సమర్తవంతంగా పనిచేశారు.

ఇక స్థానిక సంస్థలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా జగన్ వెంటనే సీఎస్ నీలం సాహ్ని నిలబడి ఆయనకు మద్దతుగా నిలిచారు. నిమ్మగడ్డకు గాటు లేఖ రాశారు. జగన్ చెప్పినట్టు నడుచుకున్నారు.

కాగా నీలం సాహ్ని ప్లేసులో కొత్త సీఎస్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈమె తరువాత అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆధిత్యనాత్ దాస్. ప్రస్తుతం జలవనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. రేసులో ఈయనే ముందున్నారు.

ఇక ఈయన కంటే సీనియర్ అధికారులు ఏపీ కేడర్ లో ఉన్నారు. డాక్టర్ సమీర్ శర్మ, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర.. ఈ ముగ్గురూ ఆదిత్యనాథ్ కంటే సీనియారిటీ ఉన్న వారే.

ఇక పదవీకాలం, సీనియారిటీ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది నవంబర్ 30వరకు సర్వీసు ఉన్న సమీర్ శర్మ సీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే ఆధిత్యనాథ్ వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.