Begin typing your search above and press return to search.

హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరు ?

By:  Tupaki Desk   |   8 July 2021 3:11 AM GMT
హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరు ?
X
హిందువులు అనగానే అందరికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు శ్రీరాముడు. దేశంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో శ్రీరాముడి ఆలయం కూడా ఉంటుంది. అందుకే హిందువులు అనగానే శ్రీరాముడే గుర్తుకు వస్తాడు. అయితే , ఎందుకని అలా చెప్తారో ఎవరికీ తెలియదు. ఇలాంటి తరుణంలో ఈ మధ్యనే అమెరికాకు చెందిన ఒక సంస్థ చేసిన సర్వే లో ఫలితం చూస్తే హిందువులకే షాక్ తగిలేలా ఉంది. హిందువులు ఎక్కువగా కొలిచే దేవుడు ఎవరన్న అంశం పై పీవ్ రీస‌ర్చ్ సెంట‌ర్ సర్వే చేస్తే .. హిందువులు అనగానే రాముడు గుర్తుకు వచ్చినా హిందువులు ఆరాధించేది మాత్రం శివుడిని అని ఆ సర్వే తెలిపింది. ఈలోకం అంతా ఈశ్వరుడే శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు.. అందుకే హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవతల్లో ఎక్కవ ఇష్టమైన దేవుడిగా శివుడుకే పూజలు చేస్తుంటారు. హిందూ పాంథియోన్‌ లో శివుడుని ‘ది డిస్ట్రాయర్’గా పిలుస్తుంటారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం.. హిందువులలో అత్యధిక సంఖ్యలో ఇష్టపడే దేవుడు శివుడు అని వెల్లడించింది.

హిందువుల్లో దాదాపు 45 శాతం మంది ఆ భోళాశంకరుడిని ఆరాధిస్తారని సర్వే ఫలితం వెల్లడించింది. శివుడి తర్వాతి స్థానం హనుమంతుడిగా గుర్తించారు. ఆ తర్వాత వరుసలో వినాయకుడు.. లక్ష్మీ.. కృష్ణుడు.. కాళీమాత.. చివర్లో రాముడు ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆ అయోధ్య రాముడి కంటే కూడా ఆయన బంటు హనుమంతుడినే ఎక్కువ మంది ఆరాధిస్తున్నారట. శ్రీరాముడ్ని కేవలం 17 శాతం మంది హిందువులు పూజిస్తామని చెబితే.. హనుమంతుడ్ని మాత్రం 32 శాతం మంది ఆరాధిస్తామని సర్వేలో వెల్లడించారు. తమ సర్వేను దాదాపు 30 వేల మందితో నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా 22,975 మంది హిందువులను ఇంటర్వ్యూలు చేశారు. ఏ దేవుడు అంటే ఎక్కువగా ఇష్టమని అడిగారు. 15 దేవతల ఫొటోలను చూపించి చెప్పమన్నారు. మెజారిటీ హిందువుల్లో 84 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ దేవుళ్లను ఎన్నుకున్నారు. చాలా మంది హిందువులు తమ వ్యక్తిగత దేవుళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు. హిందువులు సాధారణంగా అత్యంత ఇష్టంగా భావించే దేవత శివుడు (44 శాతం) ఉన్నారు.

హిందువులు తమ ఇష్టదైవంగా ఎంతమంది దేవతలను భావిస్తారనే దానిపై ప్రాంతీయంగా వైవిధ్యం ఉంది. వీరిలో 46 శాతం మంది వేర్వేరు దేవతలను తమ ఇష్టదైవాలుగా కలిగి ఉంటారని అంచనా. భారత్ లోని పశ్చిమ రాష్ట్రాల్లో హిందువులు గణేశుడిని ఇష్టదైవంగా భావిస్తున్నారు. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో 15 శాతం మంది మాత్రమే ఇలా భావిస్తున్నారు. ఈశాన్యంలో 46 శాతం హిందువులు కృష్ణుడిని ఇష్టదైవంగా భావిస్తుండగా దక్షిణాదిలో కేవలం 14 శాతం మంది ఇదే చెబుతున్న వారు ఉన్నారు. రాముడు అంటే ఇష్టమనే భావాలు ముఖ్యంగా సెంట్రల్ రీజియన్‌ లో 27 శాతం మంది ఉన్నారు. కానీ, ఇతర ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఈ సర్వేలో భాగంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, ఉత్తరాఖండ్‌ లను కేంద్ర ప్రాంతంగా గుర్తించారు. హిందువులు ఎక్కువ మంది దేవతలను ఏకధర్మ రహిత మతంగా భావిస్తున్నారు. వారిలో చాలామంది దేవుడు ఒకడే అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. సర్వే ప్రకారం.. 61 శాతం హిందువులు ఒకే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న హిందువుల్లో 77 శాతం మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మగా.. 73 శాతం మంది విధిని కూడా బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. అదేసమయంలో సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 27 శాతం మంది ముస్లింలు పూర్వ జన్మపై నమ్మకం ఉందని చెప్పారట.