Begin typing your search above and press return to search.

గత శతాబ్దంలో అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారంటే ?

By:  Tupaki Desk   |   24 Jun 2021 4:30 AM GMT
గత శతాబ్దంలో అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారంటే ?
X
ఇండియా పారిశ్రామిక పితామహుడుగా గుర్తింపు తెచ్చుకున్న జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్దకాలంలో దాతృత్వాన్ని చాటడంలో హురున్‌ రిపోర్ట్‌, ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన రిపోర్ట్‌ లో జేఆర్‌ టాటా మొదటిస్థానంలో నిలిచారు. సుమారు జేఆర్‌ టాటా 102 బిలియన్ల డాలర్ల ను వివిధ సామాజిక కార్యాక్రమాలకోసం విరాళాలుగా అందించారు. దీనితో ప్రపంచంలోనే అత్యంత విరాళాలను ఇచ్చిన వ్యక్తిగా జేఆర్‌ టాటా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం టాటా కంపెనీ ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ పనుల వరకు చేస్తోంది. జేఆర్‌ టాటా తరువాత , బిల్‌గేట్స్‌ అతని భార్య మిలిందా గేట్స్‌ సుమారు 74.6 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో , వారెన్‌ బఫెట్‌ 37.4 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో , జార్జ్‌ సోరోస్‌ 34.8 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్ధానంలో నిలిచారు.

గత శతాబ్ద కాలంలో అమెరికన్‌, యూరోపియన్‌ కు చెందిన బిలియనీర్లు సామాజిక కార్యక్రమాలను చేయడంలో ముందున్నా, టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాను అధిగమించడంలో వెనుకబడ్డారని హురున్‌ చైర్మన్‌, పరిశోధకుడు రూపెర్ట్ హూగ్వెర్ఫ్ విలేకరులతో అన్నారు. కంపెనీ లాభాల్లో మూడింట రెండు వంతులు విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలకు విరాళాలను కేటాయించడంతో జంషెట్జీ టాటా ముందంజలో నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ, తన మొత్తం సంపాదనలో 22 బిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలను చేపట్టడానికి విరాళంగా ఇచ్చారు. హురున్‌ రిపోర్ట్‌, ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన రిపోర్ట్‌లో టాప్‌ 50 మందిలో యూఎస్‌ నుంచి 38 మంది, యూకే నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు నిలిచారు.