Begin typing your search above and press return to search.

హోటల్ లాంజ్ లో మ్యాక్స్ వెల్ పక్కనున్న ఆమె ఎవరు?

By:  Tupaki Desk   |   3 April 2021 1:30 AM GMT
హోటల్ లాంజ్ లో మ్యాక్స్ వెల్ పక్కనున్న ఆమె ఎవరు?
X
ఐపీఎల్ సీజన్ లో అత్యధిక ధర పలికిన క్రికెటర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒకరు. అతగాడ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసిన వైనం తెలిసిందే. త్వరలో షురూ అయ్యే ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చేశారు మ్యాక్స్ వెల్. తాను భారత్ కు వచ్చిన విషయాన్ని అతడు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా వైరల్ అవుతున్నఫోటో ఆసక్తికరంగా మారింది.

మ్యాక్స్ వెల్ పక్కనున్న యువతి ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది. చేతిలో వైన్.. ముఖానికి మాత్రం మాస్కు పెట్టుకోవటంతో ఆ అమ్మాయి ఎవరన్నది అర్థం కాలేదు. వాస్తవానికి 2020 ఫిబ్రవరిలో మాక్స్ వెల్ కు భారత యువతి విన్నీ రామన్ తో ఎంగేజ్ మెంట్ కావటం తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలో అతడితో ఉన్నది ఆమె కాదు. దీంతో.. ఈమె ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది.

అసలు విషయం ఏమంటే.. మ్యాక్స్ వెల్ పక్కన చిల్ అవుతున్న ఆమె ఎవరో కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ స్పోర్ట్స్ యాంకర్ నెరోలి మెడోస్. ఐపీలో కోసం తన స్నేహితుడైన మ్యాక్సీతో ఆమె ఇండియాకు వచ్చారు. ఇద్దరూ హోటల్ లో కలుసుకున్న వేళలో దిగిన ఫోటోగా చెబుతున్నారు. గత ఏడాది యూఏఈలో యాంకరింగ్ చేసిన ఆమె మంచి పేరు సంపాదించారు. దీంతో.. ఈసారి సీజన్ కు ఆమెను ఎంపిక చేశారు.