Begin typing your search above and press return to search.

ఎవ‌రికి తృప్తి ఉంది.. కోన నీతులు మీకు వ‌ర్తించ‌వా..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 6:09 AM GMT
ఎవ‌రికి తృప్తి ఉంది.. కోన నీతులు మీకు వ‌ర్తించ‌వా..!
X
అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీక‌ర్, బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే..ఆయ‌న పెద్ద వివాదాస్ప‌ద అంశాన్నే కెలికేశారు. ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌భుత్వంపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న ఉద్యోగుల‌ను ఆయ‌న ఏకిపారేశారు. ఉద్యోగుల‌కు తృప్తి లేద‌ని అన్నారు. ఉద్యోగుల‌కు సీఎం జ‌గ‌న్ ఎంతో చేస్తున్నార‌ని.. అయినా.. కూడా జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నార‌ని నిప్పులు చెరిగారు.

''ఉద్యోగుల‌కు పీఆర్సీ పెంచినా తృప్తి లేదు. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగీ 50 వేల నుంచి 80 వేల వ‌ర‌కు జీతం తీసుకుంటున్నారు. ఒక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇది చాల‌దా? హెల్త్‌కార్డులు ఉన్నాయి. రూపాయిఖ‌ర్చు లేకుండా ప్ర‌భుత్వ‌మే వైద్యం అందిస్తోంది. అయినా.. వీరికి ఆశ చావ‌దు. తృప్తి తీరదు. వీరిని ఎవ‌రూ మార్చ‌లేరు'' అని కోన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే.. దీనికి కౌంట‌ర్‌గా ఉద్యోగులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మీకు తృప్తి ఉందా? స‌ర్‌! అని ప్ర‌శ్నిస్తున్నారు. 2019లో ఒక‌సారి అధికారం ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చారు.

ఇంత‌టితో మీరు కూడా తృప్తి ప‌డొచ్చుక‌దా! కానీ, మీకు మ‌ళ్లీ 2024లో అధికారం కావాలి. మ‌ళ్లీ 175కు 175 సీట్ల‌లో విజ‌యం కావాలి. కానీ, మేం ఓ ప‌ది రూపాయ‌ల వేత‌నం కోరుకుంటే మాత్రం త‌ప్పా!! మాకు తృప్తి లేద‌ని అంటారా? అని విరుచుకుప‌డుతున్నారు.

ఇదిలావుంటే..అత్యంత సున్నిత‌మైన ఉద్యోగుల విష‌యంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా. ఆచి తూచి వ్య‌వ‌హ‌రి స్తుంది. కానీ, ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌కు ఒక్క డిమాండ్ కూడా నెర‌వేర్చ‌లేద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. అందుకే స‌ర్కారుపై వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఉద్య‌మాల‌కు వ‌చ్చే నెల‌లో రెడీ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా కోన చేసిన వ్యాఖ్య‌లు మ‌రిన్ని మంట‌లు రేప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.