Begin typing your search above and press return to search.
ప్రధాని భద్రతా లోపానికి కారణం ఎవరు..?: సుప్రీంలో విచారణ
By: Tupaki Desk | 6 Jan 2022 12:30 PM GMTప్రధాన మంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.. అత్యంత భద్రత కలిగిన పీఎం కాన్వాయ్ రోడ్డుపై 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి..?అన్న విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యానికి కారణం ఎవరు..? చివరికి ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితిపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ సంఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం వ్యంగ్యాస్త్రాలను సంధిస్తోంది.
ఇక పంజాబ్ పర్యటన మధ్యలోనే రద్దయిన వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుటూ సుప్రీంలో అడ్వకేట్ మణిందర్ సింగ్ పిటిషన్ వేశారు. దీంతో సుప్రం కోర్టు కేంద్రంతో పాటు పంజాయ్ ప్రభుత్వానికినోటీసులు పంపారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా అటు పంజాబ్ ప్రభుత్వం సైతం భద్రతా లోపాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని వేసింది.
రిటైర్డ్ లాయర్ జస్టిస్ మెహ్ తాబ్, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాగ్ వర్్మతో కూడిన ఈ కమిటీ ప్రధాని పర్యటన, ఎదురైన సవాళ్లు, తదితర అంశాలపై విచారణ చేయనున్నారు. మూడురోజుల పాటు ఈ కమిటీ అధ్యయయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు.
పంజాబ్ లోని ఫిరోజ్ ఫుర్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెళ్లారు.ఫిరోజ్ ఫుర్లో అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అమృత్ సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే, శాటిలైట్ సెంటర్ తో సహా రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ర్యాలీ స్థలం నుంచి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని మోదీ విమానంలో బటిండాలో దిగారు. ఆ తరువాత భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న జిల్లాకు బయలుదేరారు.
అంతకుముందు హుస్సైనీవాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాల్సి ఉంది. ఇక్కడకు హెలీక్యాప్టర్లో వెళ్లాలి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డుపై వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే అమరవీరుల స్థూపానికి 30 కిలోమీటరల్ల దూరంలో ప్రధాని కాన్వాయ్ కి బ్రేకులు పడ్డాయి. ఓ ఫ్లైఓవర్ మీదకు చేరుకోగానే పెద్ద ఎత్తున ఆందోళన కారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయన తిరిగి వెళ్లారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తుగా ఎస్ఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసింది. అయతే తిరిగి ఏయిర్ పోర్టుకు తాను ప్రాణాలతో చేరుకోగలిగానని మోదీ తెలిపారు. కాగా ప్రజల తిరస్కరణ తట్టుకోలేకే కాంగ్రెస్ ఇలాంటి ఘటనలను పాల్పడుతుందని అమిత్ షా విమర్శించారు.. అయితే పంజాబ్లో ఎలాంటి భద్రతా సమస్య లేదని సీఎం చన్నీ అన్నారు.