Begin typing your search above and press return to search.

పదోతరగతి పేపర్ లీక్ చేసిన ‘ప్రశాంత్’ ఎవరు?

By:  Tupaki Desk   |   5 April 2023 11:15 PM GMT
పదోతరగతి పేపర్ లీక్ చేసిన ‘ప్రశాంత్’ ఎవరు?
X
తెలంగాణలో ఇప్పుడు పదోతరగతి పరీక్ష పేపర్ లీక్ సంచలనమవుతోంది. ఈ కేసులో ఏ1గా చేర్చి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి ఖమ్మం జైలుకు తరలించారు.  బండి సంజయ్ తోపాటు ఈ కేసులో పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి.

ప్రశాంత్  బీజేపీ కార్యకర్త అని.. ఆయన బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎండగడుతున్నారు. దీంతో బీజేపీ నేతలు ఖంగుతిని అసలు ప్రశాంత్ బీజేపీ మనిషి కాదని.. బీఆర్ఎస్ నేతలతో అతడు కలిసి ఉన్న ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రశాంత్ అసలు ఎవరి మనిషి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రశాంత్ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహితంగా ఉన్నాడు. బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలతో ప్రశాంత్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రశాంత్ బండి సంజయ్ మనిషి అయితే ఈ ఫొటోల సంగతేంటి? అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రశాంత్ మీడియాలో పనిచేస్తుండడంతో ఆయన అన్ని పార్టీల వారినీ కలిసే అవకాశం ఉందని.. అలా అని ఆయన బీజేపీ మనిషి అంటూ బండి సంజయ్ తో లింక్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ నేతలు వాధిస్తున్నారు.

కాగా ప్రశాంతి బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ కు సన్నిహితుడు అని.. ఇందంతా సంజయ్ కుట్ర అని అంటున్నారు పోలీసులు. దీంతో ప్రశాంత్ చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ సాగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.