Begin typing your search above and press return to search.

సీట్ల గురించి చెప్ప‌డానికి లోకేశ్ ఎవ‌రు? టీడీపీలో విస్మ‌యం

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 PM GMT
సీట్ల గురించి చెప్ప‌డానికి లోకేశ్ ఎవ‌రు? టీడీపీలో విస్మ‌యం
X
ఒంగోలు వేదిక‌గా.. మూడేళ్ల త‌ర్వాత‌.. జ‌రుగుతున్న టీడీపీ ప‌సుపు పండ‌గ మ‌హానాడు ద‌ద్ద‌రిల్లుతోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో అభిమానులు.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పోటెత్తారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు ప్ర‌సంగాలతో మ‌హానాడును ఉర్రూత లూగిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేశ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు పార్టీలో చ‌ర్చ‌కు దారి తీశాయి. మ‌హానాడు సంద‌ర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడినవారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే విషయం పై విస్తృతంగా చర్చిస్తున్నట్లు నారా లోకేశ్ అన్నారు. ఈ విషయం పై చంద్రబాబు స్పష్టత తో ఉన్నారని వివరించారు. అదే స‌మ‌యంలో పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టానని వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని వివరించారు. అంటే.. పార్టీకి కొత్త‌గా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని నియ‌మించ‌నున్న‌ట్టు లోకేశ్ చెప్ప‌క‌నే చెప్పారు. అదేస‌మ‌యంలో మూడు సార్లు ఓడిన వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఈ వ్యాఖ్య‌ల‌ పై మ‌హానాడులో ఉన్న నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ చేస్తున్నారు. ''టికెట్ల విష‌యం చెప్ప‌డానికి లోకేశ్ ఎవ‌రు? '' అని ఒక సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

అంతే కాదు.. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన‌లేక పోయిన‌.. లోకేశ్‌.. ఇప్పుడు టికెట్ల గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు. గెలుపు, ఓట‌ములు అనేవి అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి ఆధార‌ప‌డుతుంద‌ని.. తొలిసారి పోటీ చేసిన ఆదిరెడ్డి భ‌వ‌నీ.. రాజ‌మండ్రిలో గెలిచిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

అదే స‌మ‌యంలో కాక‌లు తీరిన నాయ‌కులుకూడా ఓడిపోయార‌ని.. చెబుతున్నారు. అంటే.. గెలుపు ఓట‌ములు.. ఎవ‌రు ముందుగా నిర్ణ‌యించ‌లేర‌ని.. గెలుస్తార‌ని అనుకున్న‌వారు ఓడిపోయిన సంద‌ర్భంగా అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే జ‌రిగింద‌ని.. ఇప్పుడు కొత్తేమీ కాద‌ని.. వారు చెబుతున్నారు. అయినా.. టికెట్ల విష‌యం.. షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత‌.. డిసైడ్ చేస్తామ‌ని చెప్ప‌డం ఏంటి? అని ప్ర‌శ్నించారు. ''ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చాక అభ్య‌ర్థుల‌ను డిసైడ్ చేయ‌డం అనేది శుద్ధ త‌ప్పు. అప్ప‌టికి టైం స‌రిపోదు. కొత్త‌గా పోటీ చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు వ‌స్తాయి'' అని మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏడాది ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు తిరిగి.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు వారి తో ప్ర‌జ‌ల మ‌మేకం అయ్యేందుకు స‌మ‌యం ఉంటుంది. అంతే త‌ప్ప‌.. కేవ‌లం రెండు నెల‌ల ముందు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం వ‌ల్ల‌.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. లోకేశ్‌కు ఈ విష‌యం తెలియ‌క‌ పోతే.. చంద్ర‌బాబు నో.. సీనియ‌ర్ల‌నో అడిగి తెలుసుకుంటే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు.. లోకేశ్‌కు పోల్ మేనేజ్ మెంట్‌పై అవ‌గాహ‌న కూడా లేద‌ని.. కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న ముందుగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని తెలుసుకుని.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయాల‌ని సూచించారు. మ‌రి లోకేశ్ ఏమంటారో చూడాలి.