Begin typing your search above and press return to search.
మోడీ చెప్పిన ఆ ఇమ్రాన్ ఖాన్ ఎవరు..?
By: Tupaki Desk | 14 Nov 2015 2:29 PM GMTలండన్ వాంబ్లే స్టేడియంలో వేలాది మంది ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి దాదాపు 75 నిమిషాల సేపు భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మోడీ తీరును అమితంగా తప్పు పట్టే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం తన ట్వీట్ తో పొగిడిన సంగతి తెలిసిందే. మోడీ చేసిన అద్భుత ప్రసంగాల్లో వాంబ్లే స్టేడియంలో చేసిన ప్రసంగం ఒకటన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ‘‘ఇమ్రాన్ ఖాన్’’ అనే వ్యక్తి ఉదాహరణను ప్రస్తావించారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పటంతో పాటు.. అతనొక్కడే దాదాపు 52 విద్యాపరమైన యాప్ లు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశారంటూ కీర్తించారు.
మోడీ నోటి వెంట ఇమ్రాన్ ఖాన్ అన్న పేరు వచ్చినంతనే చాలామంది.. ఎవరీ ఇమ్రాన్ ఖాన్? మోడీని సైతం మెప్పించేంత విషయం ఇమ్రాన్ లో ఏముందన్న ప్రశ్నలు చాలానే రేగాయి. మరి.. ఆ ఇమ్రాన్ ఖాన్ వివరాల్లోకి వెళదామా.
ఇమ్రాన్ ఖాన్ ది రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన గణిత ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ ను బోధిస్తుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాష్టారుగా సుపరిచితుడైన ఆయన 37 ఏళ్ల యువకుడు. గ్రామీణులకు మరింత అర్థవంతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఆయన నిరంతరం కష్టపడుతుంటారు. ఇప్పటివరకూ ఆయన 50కి పైగా మొబైల్ యాప్ లు రూపొందించి ఉచితంగా పంపిణీ చేశారు.
ఒక విదేశీ పర్యటనలో.. వేలాదిగా హాజరైన ప్రవాసీభారతీయుల ఎదుట ప్రధాని మోడీ తన పేరును ప్రస్తావించటం.. పొగడటంపై ఆయన వినమ్రతతో స్పందించారు. ఉపాధ్యాయుడిగా తాను చేస్తున్న కృషి చాలా చిన్నదని.. తన లాంటివారిని ప్రధాని పొగడటం చాలా పెద్ద విషయంగా చెప్పి మరింత మంది మనసును దోచుకున్నాడు. ఇంగ్లిషు భాషలో ఎన్నో యాప్ లు ఉన్నాయని.. కానీ.. ప్రాంతీయ భాషల్లో అలాంటి పరిస్థితి లేదని.. అలాంటి వాటిని మరిన్ని తయారు చేయటం ద్వారా గ్రామీణ విద్యను మరింత బలోపేతం చేయాలన్న తన ఆశను వ్యక్తం చేశాడు. ఎక్కడో రాజస్థాన్ లోని మారుమూల గ్రామంలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ ను దేశ ప్రధాని గుర్తించటం నిజంగానే గొప్ప విషయం కదూ.