Begin typing your search above and press return to search.
గుడ్డు ముస్లిం ఎవరు? అతీక్ సోదరుడు చెప్పిన ఈ బాంబ్ స్పెషలిస్ట్ స్టోరీ
By: Tupaki Desk | 17 April 2023 7:41 PM GMTఉత్తరప్రదేశ్ లో నిన్న రాత్రి మీడియా, పోలీసుల ఎదుట కాల్చివేయబడ్డ గ్యాంగ్ స్టర్ లు అతిక్, అష్రఫ్ చివరగా ప్రస్తావించిన పేరు ‘గుడ్డ ముస్లిం’ పేరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతిక్ అహ్మద్ కాల్చి చంపబడటానికి ముందు శనివారం రాత్రి అష్రఫ్ చెప్పిన చివరి మాటలు ‘గుడ్డు ముస్లిం’ అనే. ఇంతకీ ఎవరు ఇతను? ఏం చేస్తుంటాడు.? అన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు.. రాజకీయ నాయకుడు ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్, అష్రఫ్ తోపాటు గుడ్డు ముస్లిం కీలక సూత్రధారి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 10 మందిలో గుడ్డు ముస్లిం ఒకరు. వీరిలో ఆరుగురు మృతి చెందగా, పరారీలో ఉన్న నలుగురిలో గుడ్డు ముస్లిం ఒకరు.
ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డాడు. ఈ హత్య సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. శనివారం అతిక్, అష్రఫ్‌ల హత్య తర్వాత అందరి దృష్టి గుడ్డు ముస్లిం వైపు మళ్లింది. గుడ్డు ముస్లిం కూడా కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్. తుపాకీలను ఉపయోగించి ప్రజలను చంపడానికి బదులుగా బాంబులు విసిరి చంపడంలో ఆరితేరిపోయాడు.గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అయిన అతిక్ అహ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడు.
క్రిమినల్ గ్యాంగ్‌లతో గుడ్డు ముస్లిం సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్నాడు. 'బాంబ్ స్పెషలిస్ట్'గా పోలీసులకు సుపరిచితుడు, గుడ్డు అతీక్ యొక్క పాత సహాయకుడు అని పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన విస్తృతంగా ప్రచారం చేయబడిన వీడియోలో గుడ్డూ బయటకు వచ్చాడు. మోటారుసైకిల్‌పై వచ్చి ముడి బాంబులు విసిరి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుడ్డు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు మరియు అతడిని చివరిగా కర్ణాటకలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
-గుడ్డు ముస్లిం ఎవరు?
అలహాబాద్‌లో జన్మించిన గుడ్డు ముస్లిం చాలా చిన్న వయస్సులోనే నేర ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నాడు. అలహాబాద్ నుంచి లక్నోకు మారాడు. లక్నోలో అతను పెద్ద నేరాలకు పాల్పడ్డాడు. గుడ్డు 1997లో లక్నోలోని లా మార్టినెర్ స్కూల్ టీచర్‌ని హత్య చేసిన ఆరోపణలపై అరెస్టయ్యాడు. సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని విడుదల చేశారు.పలు నేరాల్లో పాలుపంచుకోవడం వల్ల గుడ్డు అప్పటికే పోలీసుల కల్లు కప్పి ఉత్తరప్రదేశ్ అంతటా చిక్కకుండా పారిపోయాడు. తర్వాత బీహార్‌కు పారిపోయాడు. 2001లో అరెస్టయ్యాడు.అతిక్ అహ్మద్ అతడిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడని, వారిద్దరూ సన్నిహితంగా మెలిగారని భావిస్తున్నారు.
- అతిక్ అహ్మద్‌తో అనుబంధం
అతిక్ అహ్మద్‌కు చేసిన సాయానికి గాను ఉమేష్ పాల్ హత్యలో గుడ్డు ముస్లిం పాల్గొన్నాడు. బాంబు దాడి చేసి హతమార్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం గుడ్డు ముస్లిం అనారోగ్యం పాలైనప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు అతిక్ అహ్మద్ రూ. 8 లక్షల సహాయం చేసినట్లు ఒక నివేదిక పేర్కొంది. అతీక్ అహ్మద్‌కు తిరిగి ఇచ్చే ప్రయత్నంలో గుడ్డు ముస్లిం ఉమేష్ పాల్‌పై దాడిలో పేలుడు పదార్థాలను ఉపయోగించాడని తేలింది.
అతిక్ అహ్మద్ సహాయకుడిగా ఉంటూ వచ్చిన గుడ్డు ముస్లిం అతని మొత్తం క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్వహించేవాడని తేలింది. అతీక్‌ను విచారించగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)కి గుడ్డూ గురించి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గుడ్డు కోసం అన్వేషణను ముమ్మరం చేశారు. గుడ్డు ముస్లిం అతీక్ అహ్మద్ కోసం ఆయుధాలను స్మగ్లింగ్ చేసి పంజాబ్ మీదుగా దేశంలోకి తీసుకొచ్చేవాడు.అతీక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం పోలీసు బృందం ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా ముగ్గురు షూటర్లు హతమార్చారు.
- బాంబ్ స్పెషలిస్ట్
గుడ్డు ముడి బాంబుల తయారీలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. తుపాకీని వాడి ఇతడు ప్రజలను చంపడు. ఎవరిని చంపాలన్నా బాంబులు విసరడానికే ఇష్టపడతాడు. గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్ , ముఖ్తార్ అన్సారీలతో సహా అనేక మంది డాన్‌ల వద్ద పనిచేశాడు. అతను గత 10 సంవత్సరాలుగా అతిక్ అహ్మద్ వద్ద పనిచేస్తున్నాడు. లక్నోలోని ప్రసిద్ధ పీటర్ గోమ్స్ హత్య కేసులో అతని పేరు కూడా ఉంది.ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్‌ను కాల్చి చంపిన కాల్పుల్లో గుడ్డు ముస్లిం కూడా ముడి బాంబులు విసిరాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్, ఇద్దరు పోలీసులను కాల్చి చంపినప్పటి నుండి అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న మరో ఐదుగురు రెండు నెలల లోపే చంపబడ్డారు. ఉమేష్ పాల్ హత్య ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 10 మందిలో మొత్తం ఆరుగురూ ఉన్నారు. అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సోదరుడు అష్రఫ్, సహచరులు అర్బాజ్, విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ , గులాం హసన్ హత్యకు గురైన ఉమేష్ పాల్ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురు. గుడ్డూ ప్రస్తుతం పరారీలో ఉంటూ దేశమంతా తప్పించుకు తిరుగుతున్నాడు.