Begin typing your search above and press return to search.

లగడపాటి కెలుకుడు వెనుక ఎవరు.?

By:  Tupaki Desk   |   30 Jan 2019 4:43 PM GMT
లగడపాటి కెలుకుడు వెనుక ఎవరు.?
X
తెలంగాణ ఎన్నికలు అయిపోయిన అంశం. దాని గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం. తెలంగాణలో ఓడిపోయిన కాంగ్రెసోళ్లు కూడా ఎన్నికల ఫలితాల గురించి ఎప్పుడో మర్చిపోయారు. ఇలాంటి టైమ్‌ లో ఢిల్లీ వెళ్లి మరీ లగడపాటి రాజగోపాల్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టాడు. ప్రెస్‌ మీట్‌ పెట్టి..తెలంగాణలో ఏదో జరిగింది అనే అనుమానం అందరితో పాటు తనకు ఉందని చెప్పకనే చెప్పేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంత సడన్‌గా.. అదీగాక ఎపీ ఎన్నికల వేల లగడపాటి ఎందుకు మీడియా ముందుకు వచ్చినట్లు. ఇందులో ఆంతర్యం ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు.

ఒకటి మాత్రం నిజం.. తెలంగాణ ఎన్నికల్లో ఏదో జరిపోయిందని కాంగ్రెస్‌ వాళ్ల వాదన తీసుకున్నారు లగడపాటి. ముఖ్యంగా వీవీ ప్యాట్‌ ల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా వీవీ ప్యాట్‌ల గురించే ప్రధానంగా ప్రశ్నిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాల్ని గత వారం రోజులుగా మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి చంద్రబాబుతో లగడపాటి భేటీ అయిన తర్వాతి రోజే ఈ ప్రెస్‌ మీట్ పెట్టడంతో.. చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే లగడపాటి మీడియా ముందుకు వచ్చారని, దీని వెనుక చంద్రబాబు - కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఉన్నారని ఆరోపిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే.. తెలంగాణ ఎన్నికల సర్వేతో లగడపాటి ఇమేజ్‌ బాగా డ్యామేజ్‌ అయ్యింది. అంతకుముందు ఆహా ఓహా అన్నవాళ్లు కూడా లగడపాటిని బండబూతులు తిట్టారు. బెట్టింగ్‌ రాయుళ్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి అమ్ముడుపోయాడని ఆరోపించారు. దీంతో.. తనను తాను డిఫెండ్‌ చేసుకునేందుకు.. తెలంగాణ ఎన్నికల్లో ఏదో జరిగిందనే కాంగ్రెస్‌ వాదనను లగడపాటి ఎత్తుకున్నారు. దీనిద్వారా తన సర్వేలు నిజమని.. తెలంగాణలోనే డబ్బు ప్రభావం చూపిందనే ఫీలింగ్‌ తేవాలని అనుకున్నారు. పనిలో పనిగా తనపై పడిన అపప్రదను పోగొట్టుకోవాలని అనుకున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ.. లగడపాటి ప్రెస్‌ మీట్‌ చిన్నపాటి సంచలనమే సృష్టించింది.