Begin typing your search above and press return to search.

ఆర్య సమాజ్ పెళ్లిళ్ల సర్టిఫికెట్లు చెల్లవు: సుప్రీంకోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   3 Jun 2022 12:34 PM GMT
ఆర్య సమాజ్ పెళ్లిళ్ల సర్టిఫికెట్లు చెల్లవు: సుప్రీంకోర్టు సంచలనం
X
ఊ అంటే చాలు ఈ కాలం యువత ఆర్య సమాజ్ కెళ్లి వివాహాలు చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఆర్య సమాజ్ ను యువత దేవాలయంగా చూస్తున్న రోజులున్నాయి. ఆర్య సమాజ్ వద్ద లవ్ మ్యారేజ్ లు చాలా జరుగుతుంటాయి. అక్కడ కొట్లాటలు కూడా అవుతుంటాయి. అయితే ఇప్పుడా ఆర్య సమాజ్ పెళ్లిళ్లు చెల్లవు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లి సర్టిఫికెట్లను గుర్తించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను జారీ చేసే అధికార పరిధి ఆర్య సమాజ్ కు లేదని స్పష్టం చేసింది. అది వాళ్ల పని కూడా కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆర్య సమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఆర్య సమాజ్ పని, అధికార పరిధి వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కాదని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేసే ఈ పనిని సమర్థ అధికారులు మాత్రమే చేస్తారు. ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్ల మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను జారీ చేసే అధికార పరిధి ఆర్య సమాజ్ కు లేదని.. అది వాళ్ల పని కూడా కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తమ బిడ్డ మైనర్ అని.. ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేసి బలవంతంగా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.

అమ్మాయి మైనర్ అని.. బలవంతంగా పెళ్లి చేశారని బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే యువకుడు మాత్రం అమ్మాయి మేజర్ అని పేర్కొన్నాడు. ఆమె తన ఇష్టానుసారం హక్కుతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందన్నారు. ఆర్య సమాజ్ మందిర్ లో వివాహం జరిగిందని.. ఆర్య సమాజ్ ప్రతినిధి సభ