Begin typing your search above and press return to search.

మేకతోటి బోణీ.. క్యూలో చాలా మందేనా...?

By:  Tupaki Desk   |   6 Nov 2022 2:43 AM GMT
మేకతోటి బోణీ.. క్యూలో చాలా మందేనా...?
X
దర్జాగా వారు మంత్రి పదవులు అనుభవించారు. వారిని సడెన్ గా తప్పించేశారు. కంటి తుడుపు చర్య అన్నట్లుగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్లను చేశారు. నిజానికి వారంతా ఆ పదవులు చేపట్టి పార్టీని గెలిపించి ప్రమోషన్ మీద మంత్రులు అయ్యారు. అలా అయిన వారిని మాజీలుగా చేయడం అంటే అది డిమోషన్ అనుకుంటే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించి మరింత తగ్గించారా అన్న చర్చ నాడే వచ్చింది. పార్టీ అధికారంలో ఉంటే ప్రెసిడెంట్ గిరీలు ఎందుకు ఈ కోశానా అసలు పనిచేయవు. మంత్రులుగా వైభోగం అనుభవిస్తూ వెలిగిపోవాల్సిన వారు ఇపుడు హెడ్ మాస్టర్లుగా మారి పార్టీ బాధ్యతలను చూసుకోవడం అంటే కారు దిగి కాలి నడక నడచినట్లే.

అయినా సరే జగన్ చెప్పారని అయిష్టంగా అంగీకరించారు. అయితే గత ఆరు నెలల కాలంలో గడప గడపకు ప్రోగ్రాం ఇచ్చారు. జిల్లా ప్రెసిడెంట్లు కూడా ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేలే కాబట్టి వారు ఆ పనిలో ఉండాలి. మరో వైపు జిల్లా పార్టీని నడిపించాలి. ఇది కత్తి మీద సాము అవుతోంది. పోనీ వారికి ఏమైనా సడలింపు ఉందా అంటే అందరూ గడప తొక్కాల్సిందే అని హై కమాండ్ హుకుం జారీ చేస్తోంది. మరో వైపు కొత్త వారు మంత్రులు అయి హవా చలాయిస్తున్న చోట కష్టంగా ఉందని చాలా మంది అంటున్నారు.

ఇక్కడ ఎవరూ ఎవరి మాట వినే సీన్ లేదన్నది సుస్పష్టం. సుప్రీం అంటే జగనే. ఆయనతోనే అంతా అన్నట్లుగా పార్టీ తీరు ఉంటోంది. గడపగడపకు సరిగ్గా వెళ్ళకపోతే గ్రాఫ్ పడిపోతోందని టికెట్లకు టిక్కు పెట్టేస్తామని అంటున్నారు. ఇలా అనేక రకాలైన టాస్కులతో ఏపీలోని 26 జిల్లాల వైసీపీ ప్రెసిడెంట్లు తెగ పరేషాన్ అవుతున్నారు. చాలా మంది జిల్లా అధ్యక్షులుగా తమ పని ఏమిటన్నది తెలుసో తెలియకో చేయడమే మానుకున్నారు.

తమ సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇంతా చేసినా టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఒక వైపు ఉంటే జిల్లా పార్టీని కూడా గెలిపించాలి అన్నది నెత్తిన మోయలేని భారమే అని భావించిన వారు ఆ బరువుని దింపుకోవాలనే చూస్తున్నారుట. అయితే ఎవరు ముందు అన్నదే తర్జన భర్జన పడుతున్నారు. ఏకంగా జగన్ ఉన్న చోట నుంచే తొలి రాజీనామా వచ్చి పడింది. గుంటూరు జిల్లా పార్టీ బాధ్యతల నుంచి మేకతోటి సుచరిత తప్పుకున్నారు.

దాంతో ఇపుడు అది తొలిబోణీ గా భావించిన వారు కొందరు తామూ లైన్లో ఉంటామని అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారుట. చాలా మంది పార్టీ ఆఫీసుకే రావడంలేదు. పైగా జిల్లా కార్యవర్గాలు లేవు. నాయకులు కూడా ఎవరి మాట వైన్ స్థితిలో లేరు. అంతా ఎవరికి వరే యమునా తీరే అన్నట్లుగా సీన్ ఉందని, అందుకే తమ సొంత నియోజకవర్గంలో తాముంటే చాలు అనుకుంటున్న వారు మాకొద్దీ బాధ్యతలు అంటూ రాజీనామాలు చేస్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది.

అదే కనుక జరిగితే వైసీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. నిజానికి జిల్లా అధ్యక్షులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి క్యాబినేట్ ర్యాంక్ హోదా కల్పించి అధికార దర్జా పోకుండా చూస్తామని అప్పట్లో అధినాయకత్వం అన్నట్లుగా గుర్తు. ఇపుడు అది ఏదీ లేకపోవడంతోనే అసంతృప్తిగా చాలా మంది ఉంటున్నారు అని తెలుస్తోంది. చూడాలి మరి మేకతోటి రాజీనామా విషయంలో హై కమాండ్ రియాక్షన్ బట్టే మిగిలిన వారి వైఖరి ఉంటుంది అని అంటున్నారు.