Begin typing your search above and press return to search.

త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య‌లో నిందితుడు ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   4 Nov 2019 11:50 AM GMT
త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య‌లో నిందితుడు ఎవ‌రంటే...
X
తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజ‌యారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు విషయాలు ప్రాథమికంగా తెలిశాయి. హంతకుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా పోలీసులు గుర్తించారు. ఓ వివాహానికి సంబంధించిన విషయంలో సురేష్ కొద్దిరోజులుగా విజ‌యారెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఆమెపై కట్టిన సురేష్ ఆమెను చంపేందుకు కూడా వెనుకాడ‌లేదని తెలుస్తోంది.

పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని అత్యంత క్రూరంగా పెట్రోల్ పోసి..ఆఫీసులోనే హత్య చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ దారుణ సంఘ‌ట‌న ఉద్యోగుల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. త‌హ‌సీల్దార్ ఆఫీస్‌లోకి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు వ‌చ్చిన హంత‌కుడు దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడిన‌ట్టు ఆఫీసు సిబ్బంది చెపుతున్నారు.

ఆ త‌ర్వాత ఆమెతో మాట్లాడుతూనే తాను వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించ‌డంతో ఆమె ప‌రుగులు తీస్తూనూ ప్రాణాలు వ‌దిలింది. ఇక హంత‌కుడు పారిపోతుండా స్థానికులు వెంటాడి ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ సంఘ‌ట‌న‌లో అత‌డికి కూడా గాయాలు అయ్యాయి. హుత‌డిని అదుపులోకి తీసుకున్న హ‌యత్ నగర్ పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తహసీల్దార్ కార్యాలయానికి పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా తీరును పోలీసు సిబ్బంది పరిశీలిస్తున్నారు. దుండగుడు లోనికి వచ్చిన మార్గాన్ని, ఘటనకు పాల్పడిన తీరును పోలీసులు అంచనా వేస్తున్నారు