Begin typing your search above and press return to search.

ఎవరీ అమీర్ ఖాన్.. ఒడిశా రైలు దుర్ఘటనకు అతనికి లింకేంటి?

By:  Tupaki Desk   |   20 Jun 2023 6:40 PM GMT
ఎవరీ అమీర్ ఖాన్.. ఒడిశా రైలు దుర్ఘటనకు అతనికి లింకేంటి?
X
దేశంలో చోటు చేసుకున్న అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్న ఒడిశా రైలు దుర్ఘటన ఒకటన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ విషాద ఉదంతానికి సంబంధించిన ఒక కొత్త విషయం వెలుగు చూసింది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ సంస్థ.. ఒక ఇంటికి సీల్ చేసింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఇప్పుడు బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్ తో అమీర్ ఖాన్ పేరుతో ట్విటర్ లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ.. ఈ అమీర్ ఖాన్ ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.

అతడి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వేస్ లో జూనియర్ సిగ్నల్ ఇంజనీర్ గా పని చేస్తున్న అమీర్ ఖాన్.. ప్రమాద ఘటన జరిగిన రీజియన్ లోనే పని చేస్తున్నాడు. జూన్ 2న బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్లి ప్రశ్నించింది. అతనిపై దర్యాప్తు సంస్థలకు సందేహాలు ఉన్నాయి.

అయితే.. అతను.. అతని కుటుంబం తాజాగా కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు.. అతని ఇంటి వద్దకు వచ్చి తాళం వేసిన వైనాన్ని గుర్తించి.. అతనింటికి సీల్ వేసి వెళ్లటం గమనార్హం.

ఇండియన్ రైల్వేస్ లో జూనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తి పాయింట్ మెషిన్లు.. ఇంటర్ లాకింగ్ సిస్టమ్.. సిగ్నల్ తో సహా సిగ్నలింగ్ పరికరాలు ఇన్ స్టాలేషన్ తో పాటు మొయింటైనెన్స్.. రిపేర్లను చూసుకుంటూ ఉంటారు. రైల్వేలు సురక్షితంగా ప్రయాణించటంలో వీరు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు.