Begin typing your search above and press return to search.

కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో ఎదో దాచేస్తుంది ... ఎందుకు దాచుతుంది !

By:  Tupaki Desk   |   13 Nov 2020 1:30 PM GMT
కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో ఎదో దాచేస్తుంది ... ఎందుకు దాచుతుంది !
X
కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ముందే తెలుసా, వైరస్‌ పుట్టుకకు కారణాలు తెలిసినా అందరికి తెలియచెప్పలేదా , సంస్థకి ఎక్కువగా నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా, సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా, డబ్ల్యూహెచ్ ‌వో అంతర్గత సమావేశానికి సంబంధించిన రికార్డింగ్‌లు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ వో అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్‌ లు వెలుగులోకి వచ్చాయి.

కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు, అంతర్గత సమావేశాల్లో వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మధ్య చాలా తేడా ఉన్నట్లు వీటి ద్వారా తెలుస్తోంది. దీంతో డబ్ల్యూహెచ్ ‌వో వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ప్రజల ఆరోగ్య విషయంలో డబ్ల్యూహెచ్‌ వో పాత్ర ఎంతో కీలకం. ఈ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలే ప్రపంచ దేశాలకు దిక్సూచి. అయితే మహమ్మారి నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ వో వ్యవహారశైలి ఎన్నో విమర్శలకు తావిచ్చింది. నిధులిచ్చే సభ్యదేశాలపై సంస్థ కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు మరోసారి కరోనా పంజా విసురుతున్న క్రమంలో.. సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్‌ లు, పత్రాలు ఓ వార్తా సంస్థకు చిక్కాయి. విమర్శలను బలపరిచేలా ఉన్న ఆధారాలు లభ్యం కావడంతో డబ్ల్యూహెచ్‌ వో పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

వైరస్‌పై అధ్యయనం చేయడం ఆ ప్రయోగశాల దురదృష్టం అంటూ డబ్ల్యూహెచ్ ‌వోకు చెందిన వైద్యులు, నిపుణులు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు రికార్డింగ్‌లు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పెద్దస్థాయిలో చర్చకు తెరలేసింది. కరోనా జన్మస్థానమైన చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ గురించి వారు మాట్లాడినట్లు భావిస్తున్నారు. వైరస్‌ ప్రభావిత దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జపాన్‌ ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ వోకు వీటి నుంచి భారీగా నిధులు అందుతాయి. మహమ్మారి విషయంలో ఆ దేశాలు ఎన్ని తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు కష్టనష్టాలు ఎదుర్కొన్నాయి.

సభ్య దేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సంస్థ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు రికార్డింగ్‌ లు, పత్రాల ద్వారా తెలుస్తోంది. ట్రంప్‌ డబ్ల్యూహెచ్ ‌వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొద్దినెలల క్రితం నిధులను ఆపేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడి గురైంది. తాము ఎన్నికల్లో గెలిస్తే డబ్ల్యూహెచ్‌ వో కు అందాల్సిన నిధులను విడుదల చేస్తామని, కోతలను ఎత్తివేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కాబోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లీ అమెరికా వైపు ఆశగా చూస్తోంది. అయితే రికార్డింగ్ ‌ల వ్యవహారం డబ్ల్యూహెచ్‌ వోకు తలనొప్పిలా మారింది.