Begin typing your search above and press return to search.
అదిరేలా రాజకీయ పార్టీలకు అజ్ఞాత విరాళాలు.. ఎంత భారీగా అంటే?
By: Tupaki Desk | 19 May 2020 7:15 AM GMTప్రజాసేవ చేసేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినా.. ఆ పార్టీలకు వివిధ రూపాల్లో వచ్చే విరాళాల లెక్కను కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సి ఉంటుంది. తమకు వచ్చే ఆదాయానికి.. ఎవరెంత ఇచ్చారన్న వివరాల్ని ఈసీకి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధనను చాలా పార్టీలు లైట్ తీసుకుంటాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా రూ.20వేల లోపు వచ్చే విరాళాలకు సంబంధించిన లెక్కను వివరంగా చెప్పాల్సి అవసరం ఉండదు. రూ.20వేలకు పైన వచ్చే విరాళాలు.. ఎవరిచ్చారన్న వివరాల్ని అందజేయాలి.
ఈ అవకాశంతో.. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలన్ని అజ్ఞాత విరాళాలే ఎక్కువని చెప్పాలి. జాతీయ పార్టీలు మొదలు ప్రాంతీయ పార్టీల వరకూ అన్ని రాజకీయ పార్టీలకు చిన్న చిన్న మొత్తాలే విరాళాలు అందుతున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలకు విరాళాల రూపంలో వచ్చే ఆదాయాలకు సంబంధించిన లెక్కల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికరఅంశాల్ని వెల్లడించింది.
2018-19 సంవత్సరానికి కాను.. అన్ని ప్రాంతీయపార్టీలకు కలిపి రూ.885.95 కోట్ల విరాళాలు వచ్చినట్లుగా పేర్కొంది. ఇందులో 54 శాతానికి పైనే అజ్ఞాత విరాళాలే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తరహా విరాళాలు భారీగా అందుకునే పార్టీగా బీజేడీ నిలిచింది. ఈ పార్టీకి అజ్ఞాత విరాళాల రూపంలో వచ్చిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.213.54 కోట్లుగా చెబుతున్నారు. అజ్ఞాత విరాళాలు అధికంగా అందుకున్న పార్టీల్లో బీజేపీ తొలిస్థానంలో ఉంటే..రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఈ పార్టీకి రూ.100.50 కోట్ల రూపంలో విరాళాలు అందాయని పేర్కొంది.
మూడో స్థానంలో శివసేన (రూ.60.73 కోట్లు).. నాలుగో స్థానంలో జేడీఎస్ (రూ.39.13 కోట్లు).. ఐదో స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఆ పార్టీకి రూ.37.78 కోట్లు అజ్ఞాత విరాళాల రూపంలో అందాయి. ఇదిలా ఉంటే.. మరికొన్ని పార్టీలకుఅతి తక్కువ మొత్తాలు ఈ రూపంలో అందటం గమనార్హం. అలాంటి పార్టీల్లో డీఎంకే రూ.6 కోట్లు అయితే.. ఢిల్లీ అధికారపక్షం ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.4.57 కోట్లు మాత్రమే అందటం విశేషంగా చెప్పక తప్పదు.