Begin typing your search above and press return to search.
ప్రపంచానికి శాపంగా మారిన ధనిక దేశాల వ్యాక్సిన్ దాహం
By: Tupaki Desk | 12 May 2021 8:30 AM GMTపేరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్న మాటే కానీ.. కరోనా లాంటి కీలక సమయాన.. సదరు సంస్థ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి. వెన్నుముక లేనట్లుగా వ్యవహరించటమే కాదు.. చాలా గందరగోళానికి కారణమైందని చెప్పాలి. విపత్తు వేళ.. చిత్రవిచిత్రమైన పరిణామాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు చాలానే ఉంటాయి.. అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇప్పుడున్నంత బలహానంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంతా అయిపోయాక.. చేతులు కాలిపోయాక.. మధ్య తరహా దేశాలన్ని కరోనా విపత్తులో కూరుకుపోయాయి.. తీరిగ్గా ఆవేదన చెందితే ఏం లాభం?
కరోనాను ఎదుర్కొనే విషయంలోనూ.. వ్యాక్సిన్ ను సమకూర్చుకునే విషయంలో అనుసరించిన విధానం గురించి కనీసం హెచ్చరించటం.. కొన్ని దేశాలు ఇలాంటి విషయాల్లో పట్టనట్లుగా వ్యవహరించిన ధోరణి.. రానున్న రోజుల్లో ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయాన్ని చెప్పింది లేదు. విపత్తు వేళ.. మీకు మేం సాయం చేస్తాం.. మాకున్నా లేకున్నా అంటూ వీరావేశాన్ని ప్రధాని మోడీ మాదిరి ప్రదర్శిస్తే.. ఇవాల్టి రోజున రెమెడెసివర్ డోసులు బంగ్లాదేశ అందించటానికి ముందుకు రావాల్సి వచ్చింది. ఇంతకు మించిన ఘనత ఇంకేం ఉంటుంది చెప్పండి.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన కొన్ని కఠిన నిజాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ధనిక దేశాలు వ్యాక్సిన్ డోసుల్లో ముందున్నాయని పేర్కొంది. ఇదేమీ కొత్త విషయం కాదు. అనుకోనిదేమీ కాదు. సంపన్న దేశాలు తమ దేశ ప్రజల్నికాపాడుకోవాలనుకుంటాయి. అందుకు అవసరమైతే.. మధ్య తరహా.. పేద దేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేయటానికి.. వారి ప్రయోజనాల్ని తాము తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడవు. ఈ వాదనకు తగ్గట్లే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచ జనాభాలో సగం మంది మాత్రమే ధనిక దేశాల్లో ఉండగా.. కరోనా వ్యాక్సిన్లలో మాత్రం ఆ దేశాల వాటా ఏకంగా 83 శాతం ఉండటం గమనార్హం. అంటే.. అవసరమైన వ్యాక్సిన్ల కంటే అత్యధికంగా ఉన్నట్లు అన్న మాట. ఒకవైపు అవసరానికి సరిపడా తర్వాత.. కొరతతో కిందా మీదా పడుతుంటే.. ధనిక దేశాల ముందుచూపు ఎంతలా ఉంటుందన్న విషయం తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.
47 శాతం జనాభా ఉన్నఅల్ప ఆదాయ దేశాల్లో మాత్రం కేవలం 17 శాతం వ్యాక్సిన్ వాటాలు కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వెళ్లేలా చూడాలని ధనిక దేశాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలు ఇంకా వ్యాక్సిన్ ముఖం కూడా చూడలేదన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.
ప్రపంచ దేశాల్లో దాదాపు 12 దేశాలు వ్యాక్సిన్ ముఖమే చూడలేదట. ముందస్తుగా ఆర్డర్ చేసుకోవటంలో ధనిక దేశాలు వ్యాక్సిన్ సమీకరణలో ముందు ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా ఉన్న భారత్ లోనూ టీకా కొరత సంగతి తెలిసిందే. ఉత్పత్తి చేసేది మనమేఅయినా.. వాటిని వాడుకోలేని దుస్థితి మన సొంతం. దీనికి కారణంగా.. సంపన్న దేశాలకు అమ్ముకోవటమే కానీ మన దేశం కొనే విషయంలో మోడీ సర్కారు అనుసరించిన అలసత్వం ఈ రోజున ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కరోనాకు సంబంధించి కీలక అంశాల్నిమొదట్లోనే తీవ్రంగా హెచ్చరించి ఉంటే.. ఈ రోజున ఈ ఆవేదన భరిత మాటలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నోటి నుంచి రావాల్సిన అవసరం ఉండేది కాదేమో?