Begin typing your search above and press return to search.

కరోనా విషయంలో ఫెయిల్ అయిన డబ్ల్యూ.హెచ్.వో

By:  Tupaki Desk   |   2 Aug 2020 1:30 AM GMT
కరోనా విషయంలో ఫెయిల్ అయిన డబ్ల్యూ.హెచ్.వో
X
ప్రపంచాన్ని కాపాడాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) చేతులెత్తేసింది. కరోనాపై ఆది నుంచి ఈ వైరస్ పుట్టించిన చైనాను వెనకేసుకొస్తున్న డబ్ల్యూ.హెచ్.వో ఇప్పుడు ఈ వైరస్ ప్రభావం దశాబ్ధాల పాటు ఉండనుందని హెచ్చరికలు పంపింది. దీంతో కరోనాను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పకనే చెప్పిసినట్టైంది.

కరోనా వ్యాప్తి మొదలై ఆరునెలలు అయిన సందర్భంగా డబ్ల్యూహెచ్.వో ఎమెర్జెన్సీ టీం సమావేశమైంది. ఈ సందర్భంగా డబ్ల్యూ.హెచ్.వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ ప్రపంచదేశాలకు కరోనా వైరస్ పై హెచ్చరికలు పంపారు.ఇలాంటి మహమ్మారులు శతాబ్ధానికి ఒకటి పుట్టుకు వస్తుందని.. వాటి ప్రభావం దశాబ్ధాల పాటు కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. అయితే ఎమెర్జెన్సీ స్థితిని కొనసాగించాలా లేదా అన్న అంశంపై మాత్రం చేతులెత్తేసింది.

నిజానికి డబ్ల్యూ.హెచ్.వోపై ఆదినుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగానే ఉన్నారు. కరోనా విషయంలో నిజాలు దాచిన చైనాను వెనకేసుకొచ్చి దాని తీవ్రతను ప్రపంచానికి చెప్పకుండా డబ్ల్యూ.హెచ్.వో దాచిందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా చైనాకు సపోర్టు చేసిన డబ్ల్యూ.హెచ్.వోకు నిధులు ఆపేసి ఆ సంస్థ నుంచి అమెరికాను వైదొలిగేలా చేశారు.

ట్రంప్ అన్నట్టే ఇప్పుడు డబ్ల్యూహెచ్.వో పూర్తిగా చేతులెత్తేసింది. దశాబ్ధాల పాటు ఈ వైరస్ తీవ్రత ఉంటుందని.. వ్యాక్సిన్, మందులు వస్తాయో లేదోమోనని అసహాయత వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ లు వచ్చినా తీవ్రత ఉంటుందని తెలిపి డబ్ల్యూహెచ్.వో ఈ మహమ్మారి విషయంలో సరిగా అంచనా వేయలేక ఇప్పుడు చేతులెత్తేసి ప్రపంచదేశాల ముందర పరువు పోగొట్టుకుందని నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.