Begin typing your search above and press return to search.

మ‌న మాజీ సీఎం ప‌రువు ప‌బ్లిగ్గా పోయింది

By:  Tupaki Desk   |   18 April 2016 5:09 PM GMT
మ‌న మాజీ సీఎం ప‌రువు ప‌బ్లిగ్గా పోయింది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు పూర్తి దూరంగా ఉంటున్న కిరణ్ వ్య‌క్తిగ‌త జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓ అప‌రిచితుడు ఆయ‌న‌కు ప‌బ్లిగ్గా దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న వేశారు.

స్వ‌త‌హాగా క్రీడాకారుడు అయిన కిర‌ణ్ ఇటీవ‌ల గోల్ఫ్ ఆడటానికి స్టేడియంకు వెళ్లారు. ఆట ముగిసిన అనంత‌రం ఆయ‌న విశ్రాంతి కోసం కాసేపు కూర్చున్నపుడు ఓ అప‌రిచిత వ్య‌క్తి వ‌చ్చి ప‌ల‌క‌రించాడు. మాటామంతి క‌లిపి ఇంత‌కీ మీరేం చేస్తుంటారు అంటూ అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు ఇబ్బంది ప‌డ్డ కిర‌ణ్‌ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకున్నారు. అయితే ఉత్సాహం చావ‌ని ఆ ఉత్తరాది వ్య‌క్తి మ‌రోమారు రెట్టించి అడిగారు. దీంతో అక్క‌డే ఉన్న కొంద‌రు తెలుగు వాసులు ఇబ్బందిగా అక్క‌డ్నుంచి జారుకున్నారు.

రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న కిర‌ణ్ తిరిగి కాంగ్రెస్‌ లో చేరేందుకు సంసిద్ధంగా లేని సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బీజేపీ వైపు మొగ్గు చూప‌గా ఆ పార్టీ నో చెప్పింది. దీంతో కిర‌ణ్ కుమార్‌రెడ్డి ఇపుడు త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్నారు.