Begin typing your search above and press return to search.

మహమ్మారి ఇప్పట్లో పోదు..ఇంకొన్నాళ్లు సహజీవనమే!!

By:  Tupaki Desk   |   1 July 2020 12:30 PM GMT
మహమ్మారి ఇప్పట్లో పోదు..ఇంకొన్నాళ్లు సహజీవనమే!!
X
మహమ్మారి వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ వైరస్ కట్టడి.. నివారణ.. మందు కనిపెట్టుట.. వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఈ వైరస్ ఇప్పట్లో వైరస్ అంతం కాదని ఇంకా ప్రభంజనం కొనసాగుతుందని కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమవడానికి అనువైన వాతావరణం ఉందని.. ఇంకా ఉధృతి పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని.. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వైరస్ కట్టడి చర్యలు సమగ్రంగా అమలవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని దేశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

మహమ్మారి అంతం అంత దగ్గర్లో లేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అద్నామ్‌ గెబ్రియేసిస్‌ వ్యాఖ్యానించారు. వైరస్ వేగంగా విస్తరిస్తోందని... ఇప్పట్లో ఈ వైరస్‌ అంతం కాదని పునరుద్ఘాటించారు. మహమ్మారి విజృంభణ మొదలై ఆరు నెలలు పూర్తికావడంతో మరి కొన్నాళ్లు సుదీర్ఘ నిరీక్షణ తప్పదని స్పష్టం చేశారు. ఇది ముగిసిపోవాలని మనందరం కోరుకుంటున్నట్లు తెలిపారు.

కనీసం వైరస్ ముగింపునకు కూడా దగ్గర్లో లేమని.. ఇది కఠోర వాస్తవమని పేర్కొన్నారు. వైరస్‌తో రానున్న రోజుల్లో సహజీవనం చేయాల్సిందేనని తెలిపారు. అది ఎలా చేయాలన్న ప్రశ్నకు అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు సమాధానాలు వెతుక్కోవాలి అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. వైరస్ గురించి చైనా తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారాన్ని అందజేసి జూన్ 30 నాటికి ఆరు నెలలు పూర్తవుతోందని తెలిపారు. వైరస్ నియంత్రణ వ్యూహంలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ అమలు చేయడం చాలా కష్టమని పలు దేశాలు చేసిన ఫిర్యాదులను ఈ సందర్భంగా ఆయన కొట్టిపారేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బలమైన కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోగ్రాం అవసరమని గుర్తు చేశారు. వైరస్‌పై విజయానికి కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంతగానో తోడ్పడుతుందని, ముప్పు నుంచి కూడా రక్షిస్తుందని తెలిపారు.