Begin typing your search above and press return to search.
అంగారకుడిపై నాసా రోవర్ ను కంట్రోల్ చేసేది ఎవరంటే .. ఓ ప్రవాస భారతీయుడు ..నిజంగా గర్వకారణం !
By: Tupaki Desk | 1 March 2021 11:30 PM GMTఅంగారకుడిపై జీవం ఉందో లేదో తేల్చేసేందుకు అమెరికా అంతర్జాతీయ పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మార్స్ మిషన్ విజయం సాధించింది. పర్సెవరెన్స్ అనే రోవర్ మార్స్ ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే పని ప్రారంభించిన నాసా రోవర్ అంగారకుడికి సంబంధించి ఫొటోలను కాప్చర్ చేసి భూమిపైకి పంపిస్తోంది. ఫస్ట్ 360-డిగ్రీ పనోరమా ఫొటోలను నాసా రోవర్ విడుదల చేసింది. మాస్ట్ క్యామ్-z అనే డ్యుయల్ కెమెరా సిస్టమ్ ద్వారా జూమ్ ఫంక్షనాలిటీతో ఇది పనిచేస్తుంది. ఫస్ట్ హై డెఫినేషన్ పనోరామా కెమెరాలో బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిన సరస్సుకు సంబంధించి ఆనవాళ్లను రికార్డు చేసింది. మాస్ట్ క్యామ్-Z లో ఉండే రెండు కెమెరాలు కంటికి 2 మీటర్ల దూరంలో కనిపించే వస్తువులను సులభంగా ఫొటోలు తీయగలవు.
ఇదిలా ఉంటే .. టేకాఫ్ అయిన దాదాపు 7 నెలల తరువాత ఇది ఫిబ్రవరి 19 న అరుణ గ్రహంపై గల జెజీరో క్రేటర్ ని తాకింది. కాగా 300 బిలియన్ డాలర్ల ఈ భారీ మిషన్ ని కంట్రోల్ చేస్తుంది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భారత దేశంలో పుట్టి అమెరికాలో స్థిర పడిన ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా తన వన్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో కూర్చుని దీన్ని కంట్రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈయన లండన్ లో ఉన్నారు. నిజానికి కాలిఫోర్నియాలోని తన కంట్రోల్ మిషన్ రూమ్ లో కూర్చుని ఈయన రోవర్ ని కంట్రోల్ చేయాలి. కరోనా మహమ్మారి కారణంగా ప్రొఫెసర్ గుప్తా అక్కడికి వెళ్లలేకపోయారు. అద్దెకు తీసుకున్న తన అపార్ట్ మెంట్ లోనే ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో తాను జెట్ ప్రోపేల్షన్ ల్యాబ్ లో ఉండాల్సిందని, ఈ అపార్ట్ మెంట్ కన్నా అది చాలా పెద్దదని ఆయన చెప్పారు. అతి పెద్ద స్క్రీన్లు ఉండగా వందలాది శాస్త్రజ్ఞులు, ఇంజనీర్ల మధ్య తాను ఈ బాధ్యత చేపట్టాల్సి ఉందన్నారు. తన భార్య, పిల్లల నిద్రను భంగపరచే ఇష్టం లేక ఈ అపార్ట్ మెంటును మినీ కంట్రోల్ రూమ్ గా మార్చేశా అని తెలిపారు.
5 కంప్యూటర్లు, రెండు స్క్రీన్లు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో ఉంది ఈయన గది. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఈయన జియాలజీ నిపుణుడు. సుమారు 400 మంది రీసెర్చర్లతో గుప్తా రోవర్ ని డైరెక్ట్ చేస్తున్నారు. రోవర్ పంపే శాంపిల్స్ 2027 కల్లా భూమిని చేరుతాయని భావిస్తున్నారు. ఒక ప్రవాస భారతీయుడు ఇంత పెద్ద బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. నాసా తన రోవర్ కదలికల నియంత్రణకు ఓ ప్రవాస భారతీయుని సేవలను వినియోగించుకోవడం గమనార్హమని పలువురు అభిప్రాయపడుతున్నారు.