Begin typing your search above and press return to search.

ప్రతిరోజు లక్ష కేసులు : WHO

By:  Tupaki Desk   |   16 Jun 2020 5:12 PM GMT
ప్రతిరోజు లక్ష కేసులు : WHO
X
ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతి రోజు లక్షకు పైగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత రెండు వారాలుగా ప్రతి రోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, వీటిలో ఎక్కువగా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలు, దక్షిణాసియా దేశాలు ఉంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ సంస్థ చీఫ్ టెడ్రోస్ తెలిపారు. ఈ వైరస్ పుట్టిన చైనాలో కూడా రెండో విడత కరోనా కేసులు పెరుగుతున్నాయనీ..దీంతో వైరస్ నియంత్రించ గలిగామనుకుంటున్న దేశాల్లో కూడా మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

చైనాలోని బీజింగ్ లో వెలుగు చూసిన రెండో విడత వైరస్ కేసు మూలాలను వెతికే పనిలో డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఉన్నారని. దీనికి కారణమేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించాలనీ లేదంటే వైరస్ ఉదృతికి పెరిగే అవకాశం ఉందనిఇక ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 80,05,294 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,35,662 మంది మరణించారు. పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా, బ్రెజిల్. రష్యా తరువాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇలా రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో భారత్ అంతకంతకూ స్థానాలను పెరుగుతుండటంతో ఆందోళలకుదారి తీస్తోంది. హెచ్చరించారు.