Begin typing your search above and press return to search.

అయోధ్య వివాదం లో తీర్పు ఇస్తున్న సుప్రీం జడ్జిలు ఎవరు?

By:  Tupaki Desk   |   9 Nov 2019 4:21 AM GMT
అయోధ్య వివాదం లో తీర్పు ఇస్తున్న సుప్రీం జడ్జిలు ఎవరు?
X
దశాబ్దాలు గా సాగుతున్న అయోధ్య లోని వివాదాస్పద భూమి కి సంబంధించిన యాజమాన్య హక్కుల లెక్కను ఈ రోజు దేశ అత్యున్నత న్యాయ స్థానం తేల్చనుంది. ఐదుగురు సభ్యులున్న ఈ ధర్మాసనాని కి చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ సారథ్యం వహిస్తారు. మొత్తం సభ్యుల్లో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయ మూర్తి. ఆగస్టు ఆరు నుంచి రోజు వారీగా ఈ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించనుంది.

తీర్పును ఇచ్చే ధర్మాసనంలోని సభ్యుల విషయాని కి వస్తే..
1. సీజేఐ రంజన్ గోగోయ్
2. జస్టిస్ ఎస్ ఏ బోబ్డే
3. జస్టిస్ అశోక్ భూషణ్
4. జస్టిస్ డివై చంద్రచూడ్
5. జస్టిస్ నజీర్

ఇక.. ఈ ఐదుగురు న్యాయమూర్తుల ట్రాక్ హిస్టరీ లోకి వెళితే
1. జస్టిస్ రంజన్ గొగోయ్ (భారత ప్రధాన న్యాయమూర్తి)
%ఐదురుగు సభ్యుల ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్నారు.
% 2018 అక్టోబరు 3న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు
% పుట్టింది 1954లో.. బార్ కౌన్సిల్ లో చేరింది 1978లో.
% గౌహతి హై కోర్టు లో కెరీర్ స్టార్ట్ చేసి.. 2001లో అదే కోర్టుకు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు
% 2010లో పంజాబ్.. హర్యానా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు
% 2012 సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారు

2. జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (ఎస్ఏ బొబ్డే)
ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి.
%మహారాష్ట్రలో బార్ కౌన్సిల్ లో 1978లో చేరారు.
% బాంబే హై కోర్టు బొంబాయి బెంచ్ లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు.
% 1998లో సీనియర్ న్యాయవాది గా పని చేశారు.
% 2000లో బాంబే హై కోర్టు అదనపు న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టారు
% మధ్య ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు.
% 2013లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
% 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

3. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్ర చూడ్
% ధర్మాసనం లో మూడో న్యాయమూర్తి
% చంద్ర చుడ్ తండ్రి సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
% న్యాయ మూర్తి పదవిని చేపట్టకముందు దేశ అదనపు సొలిటర్ జనరల్ గా వ్యవహరించారు.
% ప్రపంచంలోని అనేక ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చిన ఘనత ఆయన సొంతం.
% సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టటానికి ముందు అలహాబాద్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
% శబరిమల.. భీమా కోరెగావ్.. స్వలింగ సంపర్కంతో సహా పలు పెద్ద కేసుల్లోని బెంచ్ లలో సభ్యులుగా ఉన్నారు.

4. జస్టిస్ అశోక్ భూషణ్
% ధర్మాసనం లో నాలుగో సభ్యుడైన ఆయన.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు.
% 1979 యూపీ బార్ కౌన్సిలో చేరిన ఆయన అలహాబాద్ హై కోర్టులో ప్రాక్టీస చేశారు.
% అలహాబాద్ హై కోర్టులో అనేక స్థానాల్లో పని చేశారు. 2001లో న్యాయ మూర్తిగా నియమితులయ్యారు.
% 2014 కేరళ హై కోర్టు న్యాయమూర్తిగా.. 2015లో కేరళ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
% 2016లొ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

5. జస్టిస్ అబ్దుల్ నజీర్
% ధర్మాసనంలో ఐదో న్యాయ మూర్తి. ధర్మాసనం లోని ఏకైక ముస్లిం న్యాయ మూర్తి.
% 1983లో న్యాయ వాద వృత్తిని ప్రారంభించారు.
% కర్ణాటక హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ షురూ చేసిన ఆయన తర్వాతి కాలంలో జడ్జి అయ్యారు.
% 2017 ఫ్రిబవరి లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మాసనం లోని మిగిలిన న్యాయ మూర్తుల కంటే అత్యంత జూనియర్ గా చెప్పాలి.