Begin typing your search above and press return to search.
పద్మశ్రీ పురస్కారాలు అందుకోబోతున్న రామస్వామి, సుమతి, గుస్సాడీ రాజు ఎవరు ? ఏం చేస్తారు !
By: Tupaki Desk | 26 Jan 2021 6:30 AM GMTవిభిన్న రంగాల ప్రతిభావంతులు, తమదైన రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తులకు, సేవా తత్పరత కలిగిన వ్యక్తులకు ఇచ్చే పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వారిలో ఏపీకి చెందినవారు ముగ్గురున్నారు. అన్నవరపు రామస్వామి (కళలు), నిడుమోలు సుమతి (కళలు), ఆశావాది ప్రకాశ్ రావు (సాహిత్యం) పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజు కళల విభాగంలో పద్మశ్రీ అందుకోనున్నారు. ఈ ముగ్గురి గురించి వివరంగా చూస్తే ...
కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు, ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. నాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాను. బహుమతిగా గుస్సాడీ టోపీ కూడా ఇచ్చాను. హన్ను మాస్టారు స్పూర్తితో ముందుకు సాగుతున్నా అని పద్మశ్రీ కనక రాజు అన్నారు.
ఇక వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి గురించి వివరాలు చూస్తే .. మనసును ఆహ్లాదపరిచే కళతో జనులను రంజింపచేసిన కళాకారుడే చరితార్థుడవుతాడు. వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి అభిప్రాయం ఇది. దీనికి తగ్గట్టుగానే ఆయన సంగీత ప్రపంచంలో సంచలనంగా మారారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీతో అన్నవరపు రామస్వామి కీర్తి మరింతగా పెరిగింది. పొరుగు జిల్లా నుంచి బాల్యంలో సంగీత శిక్షణ కోసం వచ్చిన ఆయన విజయవాడలోనే స్థిరపడ్డారు. రామస్వామి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో 1923 మార్చి 23న జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 97 ఏళ్లు. పెద్ద కుటుంబం కావడంతో బాల్యంలోనే ఎన్నో కష్టాలను చవిచూశారు. ఆ కష్టాల మధ్యే సంగీతంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన సంగీత శిక్షణ ఎనిమిదో ఏట ప్రారంభం కాగా, కచేరీల ప్రస్థానం 13వ ఏటనే ఆరంభమైంది. ఏలూరులోని జగన్నాథచౌదరి అనే సంగీత విద్వాంసుడి వద్ద వయోలిన్ శిక్షణ పొందారు. తర్వాత సంగీత విద్వాంసుడు దాలిపర్తి పిచ్చయ్య సలహాతో విజయవాడలోని పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వద్ద శిష్యరికం చేశారు. ఆయన వద్ద ఎనిమిదేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. రామకృష్ణయ్య పంతులు సంగీతం ఉచితంగానే నేర్పినా, రామస్వామి తిండికి ఇబ్బంది పడేవారు. సంగీతం నేర్చుకున్న సమయంలో అన్నం కోసం నాలుగేళ్లు ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పారు. బాలమురళీకృష్ణ కూడా ఈయనతోపాటే సంగీతం నేర్చుకున్నారు. ఆయన కచేరీలకు రామస్వామి వయోలిన్ సహకారం అందజేసేవారు.'
నిడుమోలు సుమతి గురించి పూర్తి వివరాలు చూస్తే ... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950వ సంవత్సరంలో పుట్టిన మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి తొలుత తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. తర్వాత విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. రామ్మోహనరావుకు మంచి శిష్యురాలిగా ఉన్న సుమతి ఆయననే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. దేశవిదేశాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. సుమతి వేలాది మంది విద్యార్థులను తయారు చేశారు. లయ వేదిక అనే సంస్థను స్థాపించి మృదంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను భర్త రామ్మోహనరావు పేరుతో సత్కరిస్తున్నారు. ఆమెకు మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాదభగీరథ, మృదంగలయ విద్యాసాగర వంటి బిరుదులు ఉన్నాయి. 1974, 1982, 1985 సంవత్సరాల్లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి ఉత్తమశ్రేణి వాయిద్య కళాకారిణి అవార్డును అందుకున్నారు. 2009లో సుమతిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. పురుషాధిక్యం బలంగా ఉన్న రోజుల్లో సుమతి మృదంగంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అప్పటినుండి నేటి వరకు కూడా మంచి స్థాయిలోనే కొనసాగుతున్నారు.