Begin typing your search above and press return to search.

అబ్బే...మేం యుద్ధం చేయ‌బోంః అమెరికా

By:  Tupaki Desk   |   27 Sep 2017 4:40 AM GMT
అబ్బే...మేం యుద్ధం చేయ‌బోంః అమెరికా
X
వ‌ర్త‌మాన ప‌రిణామాల‌పై కాస్త అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రిని అడిగినా... ``ప‌రిస్థితి చూస్తుంటే...ఉత్త‌ర‌కొరియా-అమెరికా మ‌ధ్య యుద్ధం ఖాయం అనిపిస్తోంది. ఇరు దేశాధినేత‌లు చేస్తున్న రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు ఇందుకు స్ప‌ష్ట‌మైన ఉదాహ‌ర‌ణ‌. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ దూకుడు చూస్తుంటే ఏ క్ష‌ణాన యుద్ధం ప్ర‌క‌ట‌న చేస్తాడో అనిపిస్తోంది``అంటూ విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే...ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన అమెరికా - ఉత్తర కొరియాల మాటల యుద్ధం క్రమంగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణం లోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అంత‌ర్జాతీయ‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇలా యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్న నేప‌థ్యంలో అగ్ర‌రాజ్య అమెరికా ఆస‌క్తిక‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్త‌ర‌కొరియాపై యుద్ధం ప్రకటించామనే వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌ నాయకత్వం ఒక ప్రకటన చేసింది. ఈప్రచారం అసంబద్ధమని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా సాండర్స్‌ తెలిపారు. కొరియా అణు కార్యక్రమాలను నిలువరించడంపైనే అమెరికా దృష్టిని సారించిందని పేర్కొన్నారు. ఆర్థిక - దౌత్యపర మైన చర్యల ద్వారానే తాము ముందుకు వెళుతున్నామని సాండర్స్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఉత్తర కొరియా తన వైఖరి మార్చుకోకపోతే తమ అధ్యక్షుడి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని, దీనికి అనేక మార్గాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్‌ హొ మాట్లాడుతూ - తమపై అమెరికా యుద్ధం ప్రకటించిన విషయం ప్రపంచానికంతా తెలుసని వ్యాఖ్యానించారు. తాము అమెరికాకు ధీటుగా సమాధానమిస్తామని చెప్పారు. అమెరికా యుద్ధ విమానాలు తమ భూభాగంలో లేనప్పటికీ వాటిని కూల్చేస్తామని ప్రకటించారు. ఐరాస సాధారణ సభ సమావేశం తర్వాత న్యూయార్క్‌ నుంచి ఉత్తర కొరియా చేరుకున్న వెంటనే రి యాంగ్‌ ఈ ప్రకటన చేశారు.

అమెరికా-ఉత్త‌ర‌కొరియా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత అమెరికా యుద్ధ విమానాలు ఉ.కొరియా గగనతలంలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా - జపాన్‌ - దక్షిణ కొరియా దేశాలు ఉ.కొరియాను రెచ్చగొట్టే చర్యల్ని చేపడుతున్నాయి. తాము ధృడత్వం, స్థిరంగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామాని జపాన్‌ విదేశాంగ మంత్రి కాంగ్‌ క్యూంగ్‌ హూ ప్రకటించారు. ఉత్తర కొరియా తన వైమానిక స్థావరాలు - తీరప్రాంతాలను పటిష్ఠం చేసినట్టు దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించడం ఆస‌క్తిక‌రం.