Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు.. ఏదీ విజయం.. ఏదీ అపజయం?
By: Tupaki Desk | 4 Jun 2019 10:20 AM GMTఅది 2009 ఎన్నికల సమయం.. టీడీపీ, టీఆర్ ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి ఏర్పరిచాయి.అప్పుడు ఐదేళ్లు పాలించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ బాధ్యత తనదేనని.. గెలిస్తే మాత్రం ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ముందుకెళ్లారు. అదృష్టం బాగుండి గెలిచారు. అలా ఓటమిని కూడా హుందాగా బాధ్యతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వీకరించారు.
ఇక మొన్నటి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను కేటీఆర్ భుజానకెత్తుకున్నారు.. ‘సారు.. కారు..సర్కారు.. పదహారు’ అనే నినాదాన్ని ఇచ్చారు. వైరల్ చేశారు. కట్ చేస్తే 7 సీట్లను ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లకు అప్పగించిన టీఆర్ఎస్ కేవలం 9 సీట్లకే పరిమితమైంది. అయితే ఓటమిని ఒప్పుకోని కేసీఆర్.. ఈ ఓటమి బాధ్యత తనది కాదని భావించలేనన్నారు. మోడీ ఎఫెక్ట్ పనిచేసిందన్నారు. ఇలా గెలిస్తే క్రెడిట్ తన ఖాతాలో వేసుకొనే కేటీఆర్ ఓడితే మాత్రం నెపాన్ని ఇతరులపై నెట్టడం రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది..
ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచింది. వీటికి ఇన్ చార్జి కేటీఆరే.. అందరిని సమన్వయ పరిచి.. క్యాంపులు ఏర్పాటు చేయించి.. ఖర్చు పెట్టి.. వారికి మాక్ పోలింగ్ వేయించి కేటీఆర్ టీఆర్ఎస్ ను గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించారని పార్టీ శ్రేణులు ప్రచారం ప్రారంభించాయి. కేటీఆర్ ను హీరోను చేస్తున్నాయి.
ఓటమిని బాధ్యతగా తీసుకోని కేటీఆర్ కు ఇప్పుడు గెలుపును కూడా తన ఖాతాలో వేసుకోవడంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఓడినా.. గెలిచినా..ఎన్నికల కార్యక్షేత్రంలో నాయకుడు ధైర్యంగా ఎదుర్కోవాలంటున్నారు. గెలిస్తే తన వీరోచితం.. ఓడితే పక్కవారిపై నెపం సరికాదంటున్నారు.మరి కేటీఆర్ సారూ దీనిపై ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే..