Begin typing your search above and press return to search.
వైసీపీ, టీడీపీలో వాళ్లిద్దరి రెబలిజం పీక్స్
By: Tupaki Desk | 12 Feb 2020 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ ఇధ్దరు ఎంపీ రూటే సపరేటు. అయితే వారిద్దరిలో ఒక కామన్ పాయింట్ కన్పిస్తుంది. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ ఇద్దరు ఎంపీలు సొంత పార్టీలోనే రెబల్స్ లా వ్యవహరిస్తుంటారు. ఎవరేమనుకున్న పట్టించుకోకుండా తాము అనుకున్నది ఏడపెడా సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ హాట్ టాపిక్ గా మారుతుంటారు.
వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయవాడకు చెందిన టీడీపీ ఎంపీ కేశినేని నాని గురించి. ఆయన అధికారంలో ఉన్న లేకున్నా సోషల్ మీడియాలో పోస్టులతో పొలిటికల్ హిట్ పుట్టిస్తుంటాడు. ఇటీవల నిఘా బాస్ వెంకటేశ్వర్ రావుపై ట్వీట్లతో చెలరేగిపోయారు. అవినీతి అధికారులకు పార్టీ ఎలా మద్దతు ఇస్తుందంటూ కాక పుట్టించారు. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందంటూ నాని ట్వీట్లతో మండి పడ్డారు. తన దైన శైలిలో విరుచుపడటం కేశినేని నానికి అలవాటు మారింది. సొంత టీడీపీనే విమర్శిస్తూ అవినీతిని ఎత్తి చూపినా కానీ ఆయనపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా నేతలు పల్లెత్తు మాట అనకపోవడం విశేషమనే చెప్పాలి.
అదేవిధంగా నర్సాపురానికి చెందిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తీరు ఇంచుమించు ఇలానే ఉంటుంది. వైసీపీలో తనకు ఎవరితో తనకు పనిలేదని చెబుతుంటాడు. కేవలం ముఖ్యమంత్రి జగన్ మాత్రమే దేవుడని.. ఆయన మాటే వేదమంటాడు. ప్రెస్ మీట్లు, తనదైన శైలితో నర్సాపురం నుంచి ఢిల్లీ దాకా సెగలు పుట్టిస్తుంటాడు.
ఈ ఇద్దరు ఎంపీలు పార్టీలోనే ఉంటూ రెబల్స్ స్టార్లలా వ్యవహరిస్తుంటారు. అయితే ఆయా పార్టీల అధినేత వీరిని సస్పెండ్ చేసిన దాఖాలాలు లేవు. వీరికి పార్టీలో మద్దతు ఇచ్చే వారు కూడా ఉండరు. అయితే ఇటీవల వీరిద్దరు ఎంపీలు ఒకచోట కలిసినపుడు ఓ ఆసక్తికర చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ‘మన ఇద్దరి పార్టీలు వేరైనా.. మన ఇద్దరు రూటు ఒకటేనంటూ..’ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇంత రచ్చ చేస్తున్నా వీరిద్దరిపై ఆయా పార్టీల అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాత్రం మౌనం పాటిస్తున్నారు. వీరిద్దరి తీరు ఆయా పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది.