Begin typing your search above and press return to search.
పేలని మంత్రుల ఆరోపణ.. సీఎం వరి సాగును ఒప్పుకొన్నట్టేనా?
By: Tupaki Desk | 29 Dec 2021 3:19 AM GMTసీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఆ పంటను మీడియాకు చూపిస్తాంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి దీటుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు స్సందనగానా అన్నట్లు.. రాష్ట్ర మంత్రులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలు పేలవంగా సాగాయి. దశాబ్దాల వైరం ఉన్న, సైద్ధాంతికంగా బద్ధ శత్రువులైన బీజేపీ,కాంగ్రెస్ త్వరలో విలీనం కాబోతున్నాయంటూ ఆరోపించడం మరీ హాస్యా స్పదంగా ఉంది.
వాస్తవానికి రేవంత్ ప్రయత్నాలకు ప్రతిగానా అన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర అటవీ అభివ్రద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ అడ్డంకిగా మారాయని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
కేంద్రంలో కత్తులు దూసుకుంటూ రాష్ట్రంలో ప్రేమ బాణాలు వేసుకుంటున్నాయని, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు. అయితే, అనూహ్యంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. ఇదే సమయంలో తెలంగాణ రైతులకు గౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు.
కేంద్రం సహకరించ కున్నా.. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ విలీనం అన్నమాటలే చిత్రంగా అనిపించాయి. కాగా, నారు పోయని, నీరు పోయని కాంగ్రెస్, బీజేపీ మాత్రం రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నాయని విమర్శించారు. రైతు బంధు, ఉచిత కరెంటు, రైతుబీమా పథకాలకు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడంవల్లే తప్పనిసరై రాష్ట్రంలోని రైతాంగానికి వరి సాగు చేయొద్దని చెప్పాల్సి వచ్చిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమత్రినే ఏకవచనంతో సంబోధిస్తూ.. రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఆ రెండు జాతీయ పార్టీల నాయకులు ఢిల్లీలో పోరాడాలని సూచించారు.
టీఆర్‌ఎస్ ఎంపీల పోరాటానికి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కలిసిరాలేదని, రాహుల్, సోనియా ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 40 లక్షల ఉద్యోగాలకుగాను 31 లక్షల మందే ఉన్నారని, బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో పోరాడి ఖాళీగా ఉన్న 8.72 లక్షల పోస్టులను భర్తీ చేయించాలని నిరంజన్ రెడ్డి సూచించారు.
ఉద్యోగుల జోనల్ వ్యవస్థ క్రమబద్ధీకరణ అనంతరం త్వరలోనే ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. తాము ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాగూ జరిగే ప్రక్రియకు దీక్షలెందుకని ప్రశ్నించారు. వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని, అక్కడ ఎంత అభివృద్ధి చేశారో రేవంత్ రెడ్డి చూస్తానంటే తానే తిప్పి చూపిస్తానని అన్నారు.
మీడియాలో ప్రచారం కోసమే పీసీసీ అధ్యక్షుడు రచ్చ చేస్తున్నారని, గొప్పవాళ్లు కూర్చున్న పీసీసీ పీఠంపై సంస్కారంలేని వ్యక్తిని కూర్చోబెట్టారని విమర్శించారు. రేవంత్ కమర్షియల్ బిడ్డ అని, ఇంతకుముందు టీడీపీని కాంగ్రెస్ కు అమ్ముకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ను బీజేపీకి అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.
ఇంతకూ సీఎం వరి సాగు నిజమెంత?
యాసంగి పంటలను కేంద్రం కొనే పరిస్థితిలో లేదని.. రాష్ట్రంలో వరిసాగు వద్దని రాష్ట్ర్ర ప్రభుత్వం చెబుతోంది. కొనుగోలు కేంద్రాలను కూడా తెరవబోమని స్పష్టం చేస్తోంది. వానాకాలం పంటనే ఇంకా 20 లక్షల టన్నులు వస్తుందని.. దానిని కూడా పూర్తిగా కొనేలా కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ కోరుతూ రాష్ట్ర మంత్రులు వారం పాటు ఢిల్లీలో పడిగాపులు కాసినా ఫలితం లేకుండానే వెనుదిరిగారు. దీంతోనే యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం ఏమాత్రం పునరాలోచించేది లేదని స్పష్టమైంది.
అయితే, ఈ లోగానే సీఎం క్షేత్రంలో వరి సాగు చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ బాంబుపేల్చారు. దానిని మీడియాకు చూపిస్తానంటూ సోమవారం రచ్చబండ మొదలుపెట్టారు.
పోలీసులు దీనిని భగ్నం చేసిన సంగతి వేరే విషయం. మరోవైపు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. సీఎం వరిసాగు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తేనే తమను నిలదీయాలితప్ప.. సాగు చేస్తే తప్పేమిటని నిలదీశారు.
ఆరోపణలు సరే.. నైతికంగా చూస్తేసీఎం క్షేత్రంలో వరిసాగుపై ఆరోపణలను మంత్రులు విలేకరుల సమావేశంలో ఖండించలేదు. నిరంజన్ రెడ్డి.. ఈ ప్రస్తావనే తేకపోగా, తలసాని ఏకంగా తప్పేమిటని ప్రశ్నించారు. అంటే.. పరోక్షంగా సీఎం క్షేత్రంలో వరి సాగును ఒప్పుకొన్నట్టే. మరోవైపు రైతులను వరి వేయొద్దని కోరుతూ.. సీఎం ఎలా సాగుచేస్తున్నారన్న ప్రశ్నకు ఇది అవకాశం ఇస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదుగా? అనే ప్రశ్నను పక్కనపెడితే అసలు వరి సాగు ఎంతవరకు సమంజసం అని ప్రస్తావన వస్తోంది.
దీనికి మంత్రుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన కూడా లేదు. అంతేగాక రేవంత్ తలపెట్టిన రచ్చబండను అడ్డుకోవడం ద్వారా సీఎం ఫాంహౌస్ లో వరి సాగును పరోక్షంగా ఒప్పుకొన్నట్లే అయింది. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్సకు కాస్త దీటుగానే బదులిచ్నిన మంత్రులు.. సీఎం ఫాం హౌస్ లో వరి సాగు ఆరోపణ విషయంలో మాత్రం తేలిపోయినట్లు స్పష్టమవుతోంది. అంతేగాక, త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్ విలీనం అంటూ పసలేని ఆరోపణతో విషయాన్ని మరింత పలుచన చేశారు.