Begin typing your search above and press return to search.

45 కేజీల కేసీఆర్ శరీరంతో ఆయనకు ద్వేషం లేదట!

By:  Tupaki Desk   |   25 March 2021 11:30 AM GMT
45 కేజీల కేసీఆర్ శరీరంతో ఆయనకు ద్వేషం లేదట!
X
తెలంగాణ తాజా రాజకీయ సంచలనం తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫలితాలు వెల్లడైన నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు భారీగా ఓట్లు పోల్ కావటం.. కోదండం మాష్టారిని దాటి రెండో స్థానంలో నిలవటంతో ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఈ ఎన్నికల ఫలితంతో మల్లన్న ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు.

పదునైన మాటలు.. ఇప్పటివరకు రాజకీయ నేతల నోటి నుంచి వినని కొత్తతరహా మాటలు ఆయన నుంచి రావటం అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో తన మీద వచ్చే విమర్శలు.. ఆరోపణల్ని తనకు తానే ప్రస్తావిస్తూ సమాధానాలు ఇచ్చేస్తున్నారు. దీంతో.. ఎప్పటికప్పుడు తన మీద పడుతున్న మరకల్ని తన వివరణతో తుడిచేస్తుకుంటున్న పరిస్థితి. తాజాగా పలు అంశాల మీద మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకర్షించేలా మారాయి.

45 కేజీల ముఖ్యమంత్రి కేసీఆర్ శరీరంతో తనకు ఎలాంటి ద్వేషం లేదని.. ఆయన మెదడు తీసుకునే నిర్ణయాల్నే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధమైందన్న ఆయన.. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ఒట్టిదేనని చెప్పారు. అసెంబ్లీ అంటే తెలియని వారిని తనతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానన్న ఆయన.. మరోసారి ఈటెలకు టీఆర్ఎస్ లో అన్యాయం జరుగుతుందన్నారు. ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని తాను గతంలోనే ఖండించినట్లు చెప్పారు. ఈటెలను కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు.

బండి సంజయ్ తనది ఒకటే కులమైతే కావొచ్చు కానీ సిద్ధాంతాలు వేరని చెప్పారు. తాను కులానికి చెందిన వ్యక్తిని కాదని.. తన మీద కులం ముద్ర వేయొద్దాన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్.. షర్మిల డబ్బులు తనకు అవసరం లేదని..తన అనుచరులు ఒక్కరోజు టీ తాగకుంటే రూ.5కోట్లు జమ అవుతాయన్నారు.

బీజేపీతో సహా ఏ పార్టీలో చేరేది లేదని కుండబద్ధలు కొట్టిన ఆయన.. బండి సంజయ్ తనకు ఓట్లు వేయిస్తే.. వాళ్ల అభ్యర్థికి ఎందుకు వేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల కిలోమీటర్లు కానీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తే మాత్రం.. అదో సంచలనంగా మారుతుందని చెప్పటంలో సందేహం లేదు.