Begin typing your search above and press return to search.
కోహ్లీ కోసం రచ్చ చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
By: Tupaki Desk | 7 Aug 2018 9:22 AM GMTమరోసారి శ్వేతజాతి వివక్ష బయటపడింది. ఇంగ్లండ్ దేశంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి బ్రిటీష్ అభిమానులు చేసిన రచ్చ ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలవుతోంది.ఈ ఘటనపై తాజా, మాజీ క్రికెటర్లందరూ తప్పు పడుతున్నారు.
తొలిటెస్ట్ లో ఇంగ్లండ్ చేతిలో భారత్ పోరాడి ఓడిపోయింది. కెప్టెన్ కోహ్లీ వీరోచితంగా పోరాడినా మిగిలిన క్రికెటర్ల తోడు లేకపోవడంతో ఇండియా31 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి అనంతరం హోటల్ కు వెళ్లేందుకు టీమిండియా బస్సు సిద్ధమైంది. అయితే అదే సమయంలో కొందరు ఇంగ్లండ్ అభిమానులు అత్యుత్సాహం చూపారు. బస్సును అడ్డుకొని ‘మీ కోహ్లీ ఎక్కడున్నాడు.. మాకు అండర్సన్ ఉన్నాడంటూ నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఓడిపోయిన కోహ్లీ ముఖం చూడాలని ఇంగ్లండ్ వాసులు నినాదాలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై టీమిండియా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మీ టీం గెలిచినందుకు సంబరాలు చేసుకోవాలి కానీ.. మా జట్టును గెలిపించడానికి చూసిన కోహ్లీని అవమానిస్తారా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్లందరూ ఇంగ్లండ్ అభిమానుల తీరును తప్పుపడుతున్నారు.